మన ధ్యాస, నెల్లూరు,జనవరి 10 : నెల్లూరు,రంగనాయలపేట, గోపురం వీధి, గొల్ల వీధి సెంటర్ దగ్గర శనివారం ఉదయం మనం కన్వెక్షన్ హాల్న ను మదీనా వాచ్ అధినేత షేక్ ఇంతియాజ్ ప్రారంభించినారు.ఈ సందర్భంగా ఇంతియాజ్ మాట్లాడుతూ….. మనం కన్వెక్షన్ హాల్ అందరికీ అందుబాటు ధరల్లో, అన్ని సౌకర్యాలతో, అన్ని మతాల, కులాల వారికి ఇవ్వడానికి మిత్రుడు సలీం ఆధ్వర్యంలో మీ ముందుకు తెచ్చినందుకు అభినందనలు తెలియజేశారు.పిఎన్ఆర్ సాంగ్స్ అధినేత మాట్లాడుతూ…… నెల్లూరు, రంగనాల పేటలో మనం కన్వెక్షన్ హాల్ పారంభానికి రావడం చాలా సంతోషంగా ఉంది అని అన్నారు. ఈ కన్వెకన్ హాల్ అందరూ ఉపయోగించుకోవాల్సిన కోరారు. మనం కన్వెన్షన్ హాల్ అధినేత సలీం మాట్లాడుతూ….. మనం కన్వెక్షన్ హాల్ అన్ని మతాల, కులాల వారికి ఇవ్వడానికి మేము దీని నిర్మించాము, అందరూ బాగుండాలి అందులో నేనుండాలి అనే సిద్ధాంతాన్ని నేను నమ్ముతాను అందుకే అందరికీ అందుబాటు ధరలో, అన్ని వసతులతో అన్ని వర్గాల వారికి ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాము అని తెలియజేశారు. కావున ఈ మనం కన్వెన్షన్ హాల్ అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు.ఈ కార్యక్రమంలో సలీం బంధుమిత్రులు శ్రేయోభిలాషులు పాల్గొన్నారు.










