మన ధ్యాస, నెల్లూరు, జనవరి 10 : ఈ సంవత్సరం ఇచ్చే భారతరత్న అవార్డులలో పోనకా కనకమ్మకు కూడా స్థానం కల్పించి భారతరత్న అవార్డు ఇవ్వాలని నెల్లూరు పట్టణానికి చెందిన బి.సురేంద్ర నాథ్ రెడ్డి నెల్లూరు ప్రెస్ క్లబ్ లో ప్రెస్ మీట్ ద్వారా తెలిపారు. జనవరి 10న పోనకా కనకమ్మ ఆశయ సాధన సమితి సంస్థ బాధ్యులు ప్రెస్ మీట్ నందు పాల్గొనడం జరిగింది. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాకు చెందిన ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధురాలు, సంఘ సంస్కర్త పొణకా కనకమ్మ నిప్పు కణిక’ పొణకా కనకమ్మ: స్వాతంత్ర్య పోరాటంలో ధీరవనితభారత స్వాతంత్ర్య సంగ్రామంలో పురుషులకు దీటుగా పోరాడి, నెల్లూరు పేరును జాతీయ స్థాయిలో నిలబెట్టిన ధీరవనిత పొణకా కనకమ్మ. కేవలం పోరాట యోధురాలిగానే కాకుండా, విద్యావేత్తగా, రచయిత్రిగా ఆమె చేసిన సేవలు నేటి తరానికి ఎంతో స్ఫూర్తిదాయకం.పొణకా కనకమ్మ 1892 జూన్ 10న నెల్లూరు జిల్లా మినగల్లులో జన్మించారు. ఆమె తండ్రి మరుపూరు కొండారెడ్డి. తొమ్మిదేళ్ల ప్రాయంలోనే పొణకా సుబ్బరామిరెడ్డితో వివాహం జరిగింది. ఎటువంటి పాఠశాల విద్య లేకపోయినప్పటికీ, స్వయంకృషితో తెలుగు, సంస్కృతం, హిందీ భాషల్లో అపారమైన పాండిత్యాన్ని సంపాదించారు.ఉద్యమ ప్రస్థానం విప్లవ పథం నుంచి గాంధేయవాదం వరకు: తొలినాళ్లలో విప్లవ రాజకీయాల పట్ల ఆకర్షితురాలైన కనకమ్మ, తుపాకులు పేల్చడం కూడా నేర్చుకున్నారు. 1907లో బిపిన్ చంద్రపాల్ నెల్లూరు పర్యటనకు వచ్చినప్పుడు ఆయనకు ఆతిథ్యమిచ్చారు. ఆ తర్వాత గాంధీజీ బోధనలతో ప్రభావితమై అహింసా మార్గంలోకి మళ్లారు. త్యాగనిరతి: 1921లో మహాత్మా గాంధీ నెల్లూరు పర్యటనకు వచ్చినప్పుడు, ‘పినాకినీ సత్యాగ్రహాశ్రమం’ స్థాపన కోసం తనకున్న 13 ఎకరాల భూమిని విరాళంగా ఇచ్చారు. అంతేకాకుండా, గాంధీజీ పిలుపు మేరకు తన ఒంటిపై ఉన్న బంగారు నగలను విరాళంగా ఇచ్చి, జీవితాంతం మళ్ళీ నగలు ధరించలేదు. జైలు శిక్ష: ఉప్పు సత్యాగ్రహం, శాసనోల్లంఘన ఉద్యమాల్లో చురుగ్గా పాల్గొని వెల్లూరు, రాయవేలూరు జైళ్లలో సుమారు 18 నెలలకు పైగా కారాగార శిక్ష అనుభవించారు.సామాజిక మరియు విద్యా సేవలుస్త్రీ విద్య ప్రాముఖ్యతను గుర్తించిన ఆమె, 1923లో నెల్లూరులో ‘శ్రీ కస్తూరిదేవి విద్యాలయం’ స్థాపించారు. ఈ పాఠశాల భవనానికి 1929లో మహాత్మా గాంధీ స్వయంగా పునాది రాయి వేశారు. అలాగే, నిరుపేదల సేవ కోసం ‘సుజనరంజనీ సమాజం’, ‘వివేకానంద గ్రంథాలయం’ వంటి సంస్థలను నెలకొల్పారు.సాహిత్య కృషి కనకమ్మ గొప్ప రచయిత్రి కూడా. ఆమె ‘జ్ఞాననేత్రం’ (భగవద్గీత అనువాదం), ‘ఆరాధన’ వంటి అనేక కృతులు రచించారు. ఆమె సాహిత్య సేవకు గుర్తింపుగా ప్రఖ్యాత ‘గృహలక్ష్మి స్వర్ణకంకణం’ పురస్కారాన్ని అందుకున్నారు. ‘జమీన్ రైతు’ పత్రిక స్థాపనలోనూ ఆమె కీలక పాత్ర పోషించారు.1963 సెప్టెంబర్ 15న ఈ వీరవనిత తుదిశ్వాస విడిచారు. ఆస్తులను, నగలను దేశం కోసం త్యాగం చేసిన ఆమె జీవితం తెలుగువారి చరిత్రలో ఒక సువర్ణ అధ్యాయం అని బి. సురేంద్ర నాథ్ రెడ్డి తెలిపారు.
