మన ధ్యాస, కావలి, జనవరి 10: యూనివర్సల్ పాస్టర్స్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో నెల్లూరు జిల్లా బోగోలు మండలం లోని జువ్వలదిన్నె గ్రామంలోని యేసయ్య ప్రార్థన మందిరము నందు శనివారం బోగోలు మండల సేవకుల సదస్సు జరిగినది.ఈ సద‌స్సుకు ముఖ్య ప్రసంగీకులుగా పాస్టర్స్ పవర్ జాతీయ అధ్యక్షులు పులగర శోభన బాబు పాల్గొని మాట్లాడుతూ…… బైబిలు గ్రంథము లోని “సేవకులు” అను అంశంపై విశదీకరించారు.యేసయ్య సేవకుడుగా వస్తున్నట్టు యెషయా ప్రవక్త ద్వారా ప్రవచించినట్లు పులగర పేర్కొన్నారు.సేవకులు వివేకముగా ప్రవర్తించాలని, నీతిమంతులై ఉండాలని,హెచ్చింపబడి,ప్రసిద్ధులై,మహాఘనులుగా ఎంచబడాలని సూచించారు.సేవకులు యోగ్యమైన సేవ,యుక్త మైన, ఇతరులకు అభ్యంతరం, ఆటంకములేని సేవ చేయాలని శోభనబాబు సందేశమిచ్చారు.ఈకార్యక్రమంలో యూనివర్సల్ పాస్టర్స్ అసోసియేషన్ అధ్యక్షులు శేషం.పాలస్,సెక్రటరీ టి.ఇమ్మానియేలు, కుడుముల సుమన్, యేసయ్య ప్రార్థన మందిరం పాస్టర్ ఆవుల జెకర్యా మరియు దగదర్తి అల్లూరు మండల పాస్టర్లు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *