బంగారుపాళ్యం,మనధ్యాస, జనవరి 9 రిపోర్టర్:కమల్ రెడ్డి
బంగారుపాళ్యం మండల కేంద్రంలోని విజ్ఞాన్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ నందు శుక్రవారం ముందస్తు సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహించారు.పాఠశాల ఆవరణను రంగవల్లులతో సుందరంగా తీర్చిదిద్ది,పూలతో అలంకరించారు.విద్యార్థులు ఉపాధ్యాయులు పొంగల్లు నిర్వహించి భోగిమంటలు వేశారు.చిన్నారులు హరిదాసు వేషధారణలతో అలరించారు. చిన్నారుల నృత్య ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో విజ్ఞాన్ స్కూల్ కరస్పాండెంట్ ఆర్.ఎన్.జ్యోతినాథ్,ప్రిన్సిపల్ టెండ్రల్,ఇంచార్జ్ హిమగిరి, డైరెక్టర్ ఆర్.ఎన్.రవితేజ, ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు.
పోటో2.సంక్రాంతి వేడుకలలో ఉపాధ్యాయులు,విద్యార్థులు.