ముద్రగడ పద్మనాభం,ముద్రగడ గిరిబాబు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన వైఎస్సార్‌సీపీ నేత గోవింద్

మన ధ్యాస ప్రతినిథి ఏలేశ్వరం: నూతన సంవత్సరం పురస్కరించుకుని ప్రముఖ రాజకీయ నేత,మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం నివాసంలో వైఎస్సార్‌సీపీ నాయకులు బదిరెడ్డి గోవింద్ మర్యాదపూర్వకంగా .పార్టీ కార్యకర్తలు,ముఖ్య నాయకులతో ముద్రగడ గిరిబాబు నివాసంలో కలిశారు, ముద్రగడ వారికి పుష్పగుచ్ఛం అందజేసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ సందర్భంగా గోవింద్ మాట్లాడుతూ, ముద్రగడ పద్మనాభం వంటి అనుభవజ్ఞులైన నాయకుల ఆశీస్సులు ఉండటం తమకు ఎంతో గర్వకారణమని పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో పార్టీ బలోపేతానికి, ప్రజా సంక్షేమానికి అందరూ కలిసికట్టుగా కృషి చేస్తామని ఈ సందర్భంగా పునరుద్ఘాటించారు.ప్రధాన అంశాలు:
ముద్రగడ నివాసంలో పండుగ వాతావరణంలో జరిగిన భేటీ.నూతన సంవత్సర శుభాకాంక్షలతో పాటు పలు రాజకీయ అంశాలపై చర్చ.భారీ సంఖ్యలో తరలివచ్చిన వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు మరియు స్థానిక నాయకులు.
ముద్రగడ పద్మనాభం గారు కూడా గోవింద్ గారికి మరియు కార్యకర్తలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతూ, నిరంతరం ప్రజల పక్షాన నిలబడాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో జువ్విన వీర్రాజు వీర రాఘవమ్మ దంపతులు సఖిరెడ్డి బుజ్జి, శిడగం రాజేశ్వరరావు,గొడుగు నాగేంద్ర,బత్తిన శ్రీను,రాచర్ల రమేష్,దత్తి రాజా,లోగేష్ శేఖర్, బిశెట్టి రాజా,కాకాడ దావీదు,అధిక సంఖ్యలో మహిళలు, తదితరు కార్యకర్తలు పాల్గొన్నారు.

By DURGASRINIVAS

Good

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *