మన ధ్యాస,ఆత్మకూరు,డిసెంబర్ 31 :రాష్ట్రంలో ద్రాక్షారామం, సింహాచలం, నంద్యాల ఘటనలపై బుధవారం ఆత్మకూరులో పాత్రికేయులతో మాట్లాడిన మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి. మంత్రి ఆనం మాట్లాడుతూ…… ద్రాక్షారామం, సింహాచలం, నంద్యాల ఘటనలపై వెంటనే స్పందించి తగిన చర్యలు చేపట్టాం…పూర్తిస్థాయిలో విచారించి చర్యలు తీసుకున్నాం… అని తెలియజేశారు.ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా పటిష్ట చర్యలు చేపట్టాలని ఇప్పటికే అధికారులకు ఆదేశాలు ఇచ్చాం…ఆయా జిల్లాలకు చెందిన మంత్రులు కూడా పరిస్థితిని సమీక్షించి కలెక్టర్, ఎస్పీలకు ఆదేశాలు ఇచ్చారు అని అన్నారు.కోనసీమ జిల్లాలోని ప్రసిద్ధి చెందిన ద్రాక్షారామం భీమేశ్వర ఆలయం వెలుపల శివలింగాన్ని ధ్వంసం చేసిన వ్యక్తిని ఆలయ సీసీ కెమెరాల ఆధారంగా పోలీసులు గుర్తించారు అని అన్నారు.ఆలయంలోని ఒక వ్యక్తిపై కక్షతో అర్ధరాత్రి పూట అతను ఈ దుశ్చర్యకు ఒడిగట్టినట్లు తేలింది అని తెలిపారు. దేవాదాయ శాఖ అధికారులు వెంటనే ఆలయంలో మరో నూతన శివలింగాన్ని ప్రతిష్టించి పూజా కార్యక్రమాలు చేపట్టారు అని అన్నారు. నంద్యాల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో వెండి వస్తువుల స్థానంలో నకిలీ వెండి వస్తువులు ఉంచిన విషయమై కర్నూలు దేవాదాయ శాఖ డిప్యూటీ కమిషనర్ను విచారణ అధికారిక నియమించాం అని అన్నారు. వెండి ఆభరణాలు తిరిగి స్వామి వారికి చేరేవరకు తప్పు చేసిన వారు ఎంత వారైనా వదిలిపెట్టం అని అన్నారు.సింహాచలం అప్పన్న ఆలయంలో ప్రసాద వితరణ సమయంలో ప్రసాదంలో ఒక పురుగు రావడాన్ని గుర్తించి తెలిపిన భక్తుడుతో దురసుగా ప్రవర్తించిన ఆలయ ప్రసాదం కౌంటర్ లోని ఉద్యోగిపై కఠినచర్యలు తీసుకునేలా ఈవోకు ఆదేశాలు ఇచ్చాం అని అన్నారు.ఇప్పటికే ఎఫ్ఐఆర్ ను కూడా పోలీస్ కమిషనర్ నమోదు చేయడం జరిగింది అని అన్నారు.ఆలయాల పరిరక్షణ, సామాన్య భక్తుల భద్రత తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యం అని తెలిపారు. ఆలయాల్లో ఏ చిన్న పొరపాటు జరిగినా వెంటనే సరిదిద్దుకుని సంతృప్తికరంగా భక్తులకు దర్శన ఏర్పాట్లు చేస్తున్నాం అని అన్నారు.రాష్ట్రానికి సరికొత్త ముక్కోటి శోభ, గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ ఏడాది రాష్ట్రంలోని అన్ని వైష్ణవాలయాలు ముక్కోటి పర్వదినం రోజున భక్తులతో కిటకిటలాడాయి అని తెలిపారు. గత ఏడాది 5.40 లక్షల మంది భక్తులు వైష్ణవాలయాల్లో స్వామివారిని దర్శించుకుంటే.. ఈ ఏడాది 7.62 లక్షల మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు అని అన్నారు.రాష్ట్రంలోని 32 ప్రధాన ఆలయాల్లో అత్యంత వైభవంగా ముక్కోటి ఏకాదశి పర్వదిన వేడుకలు నిర్వహించాం అని అన్నారు.తిరుమలలో లక్కీ డిప్ ద్వారా టోకెన్లు పొందిన 68,000 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు అని అన్నారు. భక్తులకు దేవాదాయ శాఖ తరపున అన్ని ఏర్పాట్లు చేపట్టాం అని తెలిపారు. నేడు ద్వాదశి రోజున కూడా రాష్ట్రంలోని ప్రధాన ఆలయాల్లో వైకుంఠ ఏకాదశి దర్శనాలు కొనసాగుతున్నాయి… మరో ఎనిమిది రోజులు పాటు ఉత్తర ద్వార దర్శనం జరిగింది అని అన్నారు.హిందూ ధర్మం, సనాతన ఆచారాలు, ఆగమ శాస్త్రాలను పాటిస్తూ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆదేశాలు, సూచనల మేరకు దేవాలయాలను ఆధ్యాత్మిక నిలయాలుగా మారుస్తూ భక్తులకు సకల సౌకర్యాలను కల్పిస్తున్నాం : మంత్రి ఆనం రామనారాయణరెడ్డి అని తెలియజేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *