బంగారుపాళ్యం డిసెంబర్ 30 మన ధ్యాస
చిత్తూరు జిల్లా బంగారుపాల్యం మండలంలో మంగళవారం ముక్కోటి ఏకాదశి సందర్భంగా మల్లేశ్వరoకు చెందిన ధరణి వారి కుటుంబ సభ్యులు నలగాంపల్లి కొండపై వెలసిన శ్రీదేవి భూదేవి సమేత శ్రీవెంకటేశ్వర స్వామి గుడికి స్వామివారి దర్శనానికి వచ్చే భక్తులకు ఫ్రూట్స్ పంపిణీ చేశారు.ఈ సందర్భంగా ధరణి మాట్లాడుతూ ముక్కోటి ఏకాదశి రోజున స్వామి దర్శనానికి వచ్చే భక్తులకు ఇలా పండ్లు చేయడం సంతోషంగా ఉందని అన్నారు.