.మన ధ్యాస,నిజాంసాగర్,( జుక్కల్ ) మహమ్మద్ నగర్ మండలంలోని గున్కుల్ లో గ్రామంలో కాంగ్రెస్ అభ్యర్థి రమేష్ గెలుపొందడంతో సోమవారం డిసిసి అధ్యక్షులు ఏలే మల్లికార్జున్,మండల అధ్యక్షులు రవీందర్ రెడ్డి ఆధ్వర్యంలో సర్పంచిగా గంగి రమేష్ ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం డిసిసి అధ్యక్షులు ఏలే మల్లికార్జున్, మండల అధ్యక్షులు రవీందర్ రెడ్డి, సర్పంచ్ గంగి రమేష్ లకు శాలువా పూలమాలతో ఘనంగా సత్కరించారు.అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో మల్లికార్జున్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ కోసం చేపడుతున్న ప్రతి ఒక్క సంక్షేమ పథకం ప్రతి గడపగడపకు అందుతుందన్నారు.కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు సర్పంచులుగా గెలుపొందడం ఎంతో సంతోషంగా ఉందన్నారు.ఈ కార్యక్రమంలో సర్పంచులు కుమ్మరి రాములు,జీవన్, పంచాయతీ కార్యదర్శి అంజయ్య,తదితరులు ఉన్నారు.
