ప్రతి కార్యకర్త తెలుగుదేశం శ్రామికుడే.. కష్టపడిన ప్రతి ఒక్కరికి భవిష్యత్తులో తగిన గుర్తింపు..మై టిడిపి యాప్ ఆధారంగా “సుపరిపాలనలో తొలిఅడుగు” డోర్ టు డోర్ కార్యక్రమం విజయవంతం చేసిన వారికి గుర్తింపు..ప్రశంసాపత్రం అందచేత.

వింజమూరు, మన న్యూస్ డిసెంబర్ 29,( నాగరాజు కె)

తెలుగుదేశం పార్టీ ప్రతిష్మాత్మకంగా చేపట్టిన సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొని మై టిడిపి యాప్ ద్వారా గ్రామంలోని ప్రతి గడపకు తిరిగి విజయవంతం చేసిన ప్రతి కార్యకర్తను టెక్నికల్ ద్వారా గుర్తించి వారికి తగిన ప్రాధాన్యతనిస్తూ టిడిపి పార్టీ ప్రశంసా పత్రాలను పంపిణీ చేశారు.ఈ కార్యక్రమం వింజమూరులోని తెలుగుదేశం ప్రధాన పార్టీ కార్యాలయం నందు ఎమ్మెల్యే కాకర్ల సురేష్ అధ్యక్షతన సోమవారం నియోజకవర్గంలోని ఎనిమిది మండలాల రథసారధుల సారథ్యంలో పండుగ వాతావరణం లో కార్యకర్తలకు ప్రశంసా పత్రాల ఫోటోలను ఎమ్మెల్యే కాకర్ల సురేష్ చేతుల మీదుగా అందజేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ కోసం ప్రతి కార్యకర్త శక్తి వంచన లేకుండా కృషి చేశారని వారి కృషి ఫలితంగానే నియోజకవర్గంలో 97 వేల సభ్యత్వాలను పూర్తి చేసుకోవడం జరిగిందన్నారు. ప్రతి కార్యకర్త పార్టీ కోసం పని చేసే వారేనని కాకపోతే మై టీడీపీ యాప్ ద్వారా అధిష్టానం దృష్టికి వెళ్ళిన వారి పేర్లు మాత్రమే వచ్చాయని మిగిలిన వారు కూడా తగిన గుర్తింపు వస్తుందని తెలియజేశారు. కార్యకర్తలను ఉత్సాహపరిచి పార్టీని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు నాయకత్వం పనిచేస్తుందన్నారు.వచ్చే ఏడాది కార్యకర్తలకు తగిన ప్రాధాన్యత కల్పిస్తానని తెలిపారు. విడతలవారీగా అందరికీ న్యాయం జరుగుతుందని ఎవరు అధైర్యపడవలసిన అవసరం లేదన్నారు. నియోజకవర్గంలో 8 మండలాలలో ఆరు మండలాలకు కన్వీనర్లను నియమించడం జరిగిందని త్వరలోనే ఉదయగిరి, కలిగిరి, మండలాలకు నియమించడం జరుగుతుందన్నారు.ముందస్తుగా నూతన సంవత్సర 2026, శుభాకాంక్షలు నియోజకవర్గ ప్రజలకు నాయకులకు అధికారులకు ఎమ్మెల్యే తెలియజేశారు.ఈ కార్యక్రమంలో బిజెపి నియోజకవర్గ ఇన్చార్జ్ కదిరి రంగారావు, టెలికాం అడ్వైజర్ కమిటీ సభ్యులు, తాటికొండ అనూష,కన్వీనర్లు గూడా నరసారెడ్డి, ఉండేలా గురువారెడ్డి, చండ్ర మధుసూదన్ రావు, సిహెచ్ బయన్న, చింతల శ్రీనివాసులు, పోలినేని చంద్రబాబు నాయుడు, తిరుమలరెడ్డి, బిజ్జం కృష్ణారెడ్డి, సొసైటీ చైర్మన్లు,మాజీ కన్వీనర్లు, మధుమోహన్ రెడ్డి, ప్రభాకర్ రాజు, బిజెపి మండల అధ్యక్షులు ఈశ్వర్ రెడ్డి, ముఖ్య నాయకులు, కూటమి నేతలు, కార్యకర్తలు అభిమానులు తదితరులు ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *