మన ధ్యాస ప్రతినిథి ఏలేశ్వరం:పట్టణంలో మార్స్ ఎడ్యుకేషనల్ సొసైటీ ఆధ్వర్యంలో కంప్యూటర్ పితామహుడు చార్లెస్ బాబేజ్ 234వ జయంతి ఘనంగా నిర్వహించారు. శుక్రవారం స్థానిక మార్స్ కంప్యూటర్స్ నిర్వహకులు అడపా దుర్గారావు, విద్యార్థులతో కలిసి చార్లెస్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కంప్యూటర్ను కనుగొని ప్రపంచానికి సాంకేతిక విద్యను అందించిన ఏకైక వ్యక్తి చార్లెస్ అన్నారు. కోరాడ రాజు, గోళ్ళ సతీష్, ఉడతల రమణారావు, మసిరపు అరుణ, జువ్విన రాజు, మండ రాజేష్, గొల్లపల్లి గంగాధర్, ఆలమూరు సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు

By DURGASRINIVAS

Good

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *