కొండాపురం, మన న్యూస్, డిసెంబర్ 25,(నాగరాజు కె).

ఈరోజు ఉదయం క్రిస్మస్ సందర్భంగా కొండాపురం మండలం గొట్టిగుండల ఎస్సి కాలని చర్చిలో టిడిపి నాయకులు తిమొతి ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన క్రిస్మస్ వేడుకలలో సోదర సోదీమణులతో కలిసి ప్రార్థనలు చేసిన కోడె వెంకటరావు చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ చెరుకూరి వెంకటాద్రి నాయుడు గారు, చెరుకూరి నవీన్ గారు.అనంతరం మహిళలకి చీరలు పంపిణీ చేయడం జరిగింది.అనంతరం ఆయన మాట్లాడుతూ ఈ క్రిస్మస్ మీకొరకు రక్షకుడు జన్మించాడు అనే పవిత్ర వాక్యం ద్వారా క్రీస్తు ప్రభువు జన్మ మానవాళికి శాంతి, ప్రేమ, ఆశలను అందించింది అని వారు అన్నారు.శాంతి మీకు కలుగునుగాక అనే క్రీస్తు సందేశం ప్రతి ఒక్కరి హృదయంలో నిలిచి, సమాజంలో సోదరభావం, కరుణ, మానవత్వం పెంచిందిఅని వారు అన్నారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ సభ్యులు వెంకటసుబ్బయ్య , చెరుకూరు శేషయ్య, చంటి,మధు, బ్రహ్మయ్య, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *