కొండాపురం, మన న్యూస్, డిసెంబర్ 25,(నాగరాజు కె).

క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న కోడె వెంకట్రావు చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ చెరుకూరు వెంకటాద్రి నాయుడు చెరుకూరి నవీన్.

ఈరోజు ఉదయం క్రిస్మస్ సందర్భంగా కొండాపురం మండలం కొమ్మి గ్రామ ఎస్సి కాలని చర్చిలో ఏర్పాటుచేసిన క్రిస్మస్ వేడుకలలో సోదర సోదీమణులతో కలిసి ప్రార్థనలు చేసిన కోడె వెంకటరావు చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ చెరుకూరి వెంకటాద్రి నాయుడు ,చెరుకూరి నవీన్ అనంతరం మహిళలకి చీరలు పంపిణీ చేయడం జరిగింది.అనంతరం ఆయన మాట్లాడుతూ మీ కొరకు రక్షకుడు జన్మించాడు అనే పవిత్ర వాక్యం ద్వారా క్రీస్తు ప్రభువు జన్మ మానవాళికి శాంతి, ప్రేమ ఆశలను అందించి ది అన్నారు. శాంతి మీకు కలుగును గాక అని క్రీస్తు సందేశం ప్రతి ఒక్కరి హృదయంలో నిలిచి సమాజంలో సోదరా భావం కరుణ మానవత్వం పెంచిందని ఆయన అన్నారు. .అనంతరం భారీ కేక్ కట్ చేసి ప్రజలకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ యేన, బంకా,ఆదాము,మాలకొండయ్య,ట్రస్ట్ సభ్యులు వెంకటసుబ్బయ్య , చెరుకూరు శేషయ్య, చంటి,మధు, బ్రహ్మయ్య, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *