కలిగిరి,మన ధ్యాస, డిసెంబర్ 25,(నాగరాజు కె)
కలిగిరి మండలం ప్రజలందరికీ రావులకొల్లు టీడీపీ సర్పంచ్ పూసల వెంగపనాయుడు పవిత్ర క్రిస్మస్ పర్వదినం ప్రతి కుటుంబానికి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు.ప్రేమ,సేవాతత్పరత,క్షమా గుణాన్ని బోధించిన ఏసుక్రీస్తు జన్మదినమైన క్రిస్మస్ పండుగను అందరూ సంతోషంగా జరుపుకోవాలని వెంగపనాయుడు ఆకాంక్షించారు.ప్రతి ఒక్కరు కూడా క్రీస్తు జీవితాన్ని ఆదర్శంగా తీసుకొని నిజాయితీగా జీవించాలని,అందరం కలిసి మెలిసి ఐక్యత చాటుకుంటూ సమాజంలో స్ఫూర్తివంతమైన జీవితాన్ని గడపాలని ఆయన సూచించారు.మండల ప్రజలందరిపై ఏసుక్రీస్తు ఆశీస్సులు మెండుగా ఉండి ప్రజలందరూ ఆయురారోగ్యాలు,తో సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని పూసల వెంగపనాయుడు ఈ సందర్భంగా ఆకాంక్షించారు.క్రిస్మస్ మీకొరకు రక్షకుడు జన్మించాడు అనే పవిత్ర వాక్యం ద్వారా క్రీస్తు ప్రభువు జన్మ మానవాళికి శాంతి, ప్రేమ, ఆశలను అందించింది.శాంతి మీకు కలుగునుగాక అనే క్రీస్తు సందేశం ప్రతి ఒక్కరి హృదయంలో నిలిచి, సమాజంలో సోదరభావం, కరుణ, మానవత్వం పెంచిందిఅని ఆయన అన్నారు.ప్రేమ, దేవుని అస్సిసులు క్షమాపణ,దయ, శాంతి,సహనం వంటి,సద్గుణాలతో ప్రతి ఒక్కరు కూడా క్రీస్తు చూపిన సన్మార్గంలో పయనించాలని పూసల వెంగపనాయుడు పిలుపునిచ్చారు