మన ధ్యాస ప్రతినిథి ఏలేశ్వరం:ఈ కాలం లో నీళ్లు అంటేనే పెద్ద వ్యాపారం అయిపోయింది.ఎక్కువమంది ప్రజలు మినరల్ వాటర్కు ఆకర్షితులు అవ్వడంతో మినరల్ వాటరకు భారీగా డిమాండ్ పెరిగింది.మినరల్ వాటర్ తాగే మనిషుల సంఖ్య అధికంగా ఉండడంతో ప్రతి వీధిలో పుట్టగొడుగుల వాటర్ ప్లాంట్లు పుట్టుకొస్తున్నాయి. ఇక పలు ప్రాంతాల్లో మాత్రం బోరు, నీటి శుద్ధి చేసి మినరల్ వాటర్గా అమ్ముతూ మినరల్ వాటర్ ప్లాంట్ వ్యాపారస్తులు సొమ్ము చేసుకుంటున్నారు. మినరల్ వాటర్ తాగని మనిషి లేనందునా పోటా పోటీనా ప్రతి వీధికి మినరల్ వాటర్
ఏర్పాటు చేస్తున్నారు. ఎలాంటి అనుమతులు ఉన్న లేకపోయినా మినరల్ వాటర్ ప్లాంట్ను ఏర్పాటు చేస్తూ వ్యాపారస్తులు సొమ్ము చేసుకుంటున్నారు. మినరల్ వాటర్ ప్లాంట్ల పర్మిషన్లపై కూడా అధికారులు కన్నెత్తి చూడరు. మినరల్ వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేయాలంటే స్థానిక అధికారుల పర్మిషన్ తప్పనిసరి. కాగా అధికారుల నిర్లక్ష్యం వల్ల వ్యాపారస్తులు ఇష్టానుసారంగా మినరల్ వాటర్ ప్లాంట్ను ఏర్పాటు చేస్తున్నారు.

By DURGASRINIVAS

Good

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *