ఘనంగా సోనియా గాంధీ జన్మదిన వేడుకలు.

మన న్యూస్: పినపాక భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పినపాక నియోజకవర్గ శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు ఆదేశాల మేరకు మండల కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఏఐసీసీ మాజీ అధ్యక్షురాలు,తెలంగాణ ఇచ్చిన తల్లి శ్రీమతి సోనియా గాంధీ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సయ్యద్ ఇక్బాల్ హుస్సేన్ కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు, సిబ్బందికి పండ్లు, బ్రెడ్ పంపిణీ చేయడం జరిగింది.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, తెలంగాణ ప్రజల ఆకాంక్షను నెరవేర్చడానికి ఆత్మ బలిదానాలను ఆపేందుకు ఆంధ్రాలో కాంగ్రెస్ పార్టీకి నష్టం కలుగుతుందని తెలిసి కూడా తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన దేవత,తెలంగాణ తల్లి శ్రీమతి సోనియా గాంధీ అని అన్నారు..
ప్రధానమంత్రి పదవి చేపట్టేందుకు సోనియా గాంధీ కి అవకాశం వచ్చిన దేశ శ్రేయస్సును దృష్టిలో పెట్టుకొని తృణప్రాయంగా భావించాలని చెప్పారు.తెలంగాణ ఇచ్చిన తల్లి సోనియా గాంధీ సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండి ఇటువంటి జన్మదిన వేడుకలు మరెన్నో జరుపుకోవాలని కోరుకుంటున్నాము అని అన్నారు.అదేవిధంగా సోనియా గాంధీ ఆధ్వర్యంలో, ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున్ కార్గే, అగ్రనేత ఎంపీ రాహుల్ గాంధీ, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది అని మరొకసారి ప్రజలకు సేవ చేసే అవకాశం కల్పించినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు..ఈ కార్యక్రమంలో మాజీ ప్రజప్రతినిధులు,మండల నాయకులు యువజన నాయకులు మహిళా నాయకులు, కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు..

  • Related Posts

    పట్టణ పరిశుభ్రతకు ప్రాధాన్యతనిచ్చి మున్సిపల్ సిబ్బంది విధులు నిర్వహించాలని, ట్రైనీ కలెక్టర్ ప్రణయ్ కుమార్.

    మన ధ్యాస,నారాయణపేట జిల్లా:- పరిధిలోని మఖ్తల్ పట్టణ పురపాలక సంఘం మున్సిపల్ కమిషనర్‌గా ట్రైనీ కలెక్టర్ ప్రణయ్ కుమార్ విధులు స్వీకరించిన అనంతరం మంగళవారం ఉదయం మఖ్తల్ పట్టణం 10వ వార్డు అంబేద్కర్ నగర్ ప్రాంతంలో పర్యటించి పారిశుధ్య పనులను ప్రత్యక్షంగా…

    800 మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు,జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్

    మన ధ్యాస, నారాయణ పేట జిల్లా:- మూడవ విడత గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ప్రజలు ప్రశాంత వాతావరణంలో, నిస్పక్షపాతంగా, నిర్భయంగా తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్ ఐ పి ఎస్ పిలుపునిచ్చారు. ఎన్నికల కమిషన్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    జిల్లా టీడీపీ అధ్యక్షులుగా ఎన్నికైన బీద రవిచంద్ర కి శుభాకాంక్షలు తెలియజేసిన చెరుకూరి వెంకటాద్రి..

    జిల్లా టీడీపీ అధ్యక్షులుగా ఎన్నికైన బీద రవిచంద్ర కి శుభాకాంక్షలు తెలియజేసిన చెరుకూరి వెంకటాద్రి..

    నూతన నెల్లూరు జిల్లా టీడీపీ అధ్యక్షుని గా ఎంపికైన బీద రవిచంద్ర కు శుభాకాంక్షలు తెలిపిన పూసల వెంగపనాయుడు.

    నూతన నెల్లూరు జిల్లా టీడీపీ అధ్యక్షుని గా ఎంపికైన బీద రవిచంద్ర కు శుభాకాంక్షలు తెలిపిన పూసల వెంగపనాయుడు.

    నూతన నెల్లూరు జిల్లా అధ్యక్షునిగా ఎంపికైన బీద రవిచంద్ర కు శుభాకాంక్షలు తెలిపిన ఉదయగిరి నియోజకవర్గం టిడిపి ఏస్సి సెల్ అధ్యక్షులు స్వర్ణ కొండయ్య.

    నూతన నెల్లూరు జిల్లా అధ్యక్షునిగా ఎంపికైన బీద రవిచంద్ర కు శుభాకాంక్షలు తెలిపిన ఉదయగిరి నియోజకవర్గం టిడిపి ఏస్సి సెల్ అధ్యక్షులు స్వర్ణ కొండయ్య.

    ఎమ్మెల్యే కాకర్ల సురేష్ చేతుల మీదుగా సబ్సిడీ రుణ పత్రాల పంపిణీ.

    ఎమ్మెల్యే కాకర్ల సురేష్ చేతుల మీదుగా సబ్సిడీ రుణ పత్రాల పంపిణీ.

    ఆటో యూనియన్ నూతన కమిటీ ఎంపిక

    ఆటో యూనియన్ నూతన కమిటీ ఎంపిక

    నెల్లూరు జిల్లాలో పెండింగ్ రైల్వే ప్రాజెక్టులు, అభివృద్ధి కార్యక్రమాలు పూర్తి చేయండి…… నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి

    నెల్లూరు జిల్లాలో పెండింగ్ రైల్వే ప్రాజెక్టులు, అభివృద్ధి కార్యక్రమాలు పూర్తి చేయండి…… నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి