మన ధ్యాస,నిజాంసాగర్,( జుక్కల్ ) సంక్షేమ పథకాలు ప్రజలకు వివరించి కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థులను గెలిపించాలని జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు అన్నారు.నిజాంసాగర్ మండల కేంద్రంతోపాటు,సుల్తాన్ నగర్, అచ్చంపేట్,బ్రహ్మంపల్లి,వెల్గనూర్,మాగి,వడ్డేపల్లి,మల్లూర్, జక్కాపూర్,నర్సింగ్ రావు పల్లి, మంగ్లూర్ గ్రామాల్లో ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతరావు గ్రామాలల్లోవిస్తృతంగా ప్రచారం నిర్వహించారు.ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ చేపడుతున్న ప్రతి ఒక్క సంక్షేమ పథకం ప్రతి ఇంటింటికి అధీనందని అన్నారు. కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులను ప్రజలు భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ప్రభుత్వ వచ్చిన తర్వాత రెండు సంవత్సరాలలో ఎడలేని అభివృద్ధి ప్రతీ గ్రామ గ్రామాన జరిగిదరి ఆయన గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో డిసిసి అధ్యక్షులు ఏలే మల్లికార్జున్, పిట్లం ఏఎంసి చైర్మన్ చీకోటి మనోజ్ కుమార్,నాయకులు ఎన్ ఆర్ ఐ భాస్కర్ రెడ్డి, ప్రజా పండరీ,సాయి పటేల్,వీరారెడ్డి,భణపురం ప్రతాప్ రెడ్డి, సంపత్ రెడ్డి,తదితరులు ఉన్నారు.







