ప్రభుత్వ పాఠశాలను అంతర్జాతీయ ప్రమాణాలతో సిద్ధం చేయాలన్నది నా లక్ష్యం ….. రాష్ట్ర మంత్రి పొంగూరు నారాయణ

నెల్లూరులో ఘనంగా జరిగిన మెగా పేటీఎం 3 .0 కార్యక్రమం. వి ఆర్ హై స్కూల్లో విద్యార్థులతో కలిసి భోజనం చేసిన మంత్రి.

మన ధ్యాస, నెల్లూరు, డిసెంబర్ 6:
ప్రభుత్వ పాఠశాలలను అంతర్జాతీయ ప్రమాణాలతో సిద్ధం చేయాలనేదే తన ముఖ్య లక్షమని రాష్ట్ర పురపాలక పట్టణ అభివృద్ధి శాఖ మంత్రివర్యులు డాక్టర్ పొంగూరు నారాయణ పేర్కొన్నారు .నెల్లూరులోని ప్రభుత్వ పాఠశాలలో ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన మెగా పిటిఎం కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. పాఠశాలలో నిర్వహిస్తున్న ఆత్మీయ సమావేశానికి విద్యార్థులు వారి తల్లిదండ్రులు భారీగా తరలివచ్చారు.నగరంలోని ఎం ఎస్ ఎం, ఆర్ ఎస్ ఆర్ ,వి ఆర్ సి మూలాపేట గర్ల్స్ హైస్కూల్స్ లో పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ కార్యక్రమంలో పాల్గొన్నారు.మాక్ అసెంబ్లీలో ప్రతిభచాటి సీఎం వద్ద ప్రశంసలు పొందిన మల్లెల సంజీవయ్య స్కూల్ విద్యార్థిని హేమ హర్షితను మంత్రి నారాయణ సన్మానించారు.అదేవిధంగా జాతీయ స్థాయి క్రీడా పోటీలకు సెలెక్ట్ అయిన ఆరుమంది విద్యార్థినీ ,విద్యార్థులను కూడా అభినందించారు.తమ బంగారు భవిష్యత్తుకు బాటలు వేస్తున్న మంత్రిని విద్యార్థులు ఘనంగా సన్మానించి కృతజ్ఞతలు తెలిపారు. వి ఆర్ సి హైస్కూల్లో మధ్యాహ్నం భోజనాన్ని మంత్రి నారాయణ పరిశీలించారు. భోజన నాణ్యత పై విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులతో కలిసి నేలపై కూర్చుని మంత్రి భోజనం చేశారు. తమతో పాటు కలిసి భోజనం చేసిన మంత్రికి విద్యార్థులు థాంక్యూ సార్ అంటూ స్లోగన్స్ ఇచ్చారు. సౌకర్యాలు సదుపాయాలతో పాటు విద్యాబోధన బాగుందని మంత్రికి చిన్నారులు తెలిపారు. అనంతరం రాష్ట్ర మంత్రివర్యులు పొంగూరు నారాయణ మీడియాతో మాట్లాడుతూ ……మెగా పేరెంట్స్ టీచర్స్ మీట్ లో పాల్గొనటం చాలా సంతోషంగా ఉందన్నారు .తాను ఉపాధ్యాయుడిగానే తన జర్నీ ప్రారంభించి..కస్టపడి ఉన్నతస్థాయికి చేరానని తెలిపారు.దేశవ్యాప్తంగా నారాయణ విద్యాసంస్థలను విస్తరింప చేశానాని.వాటి బాధ్యతలు తన పిల్లలకి అప్పచెప్పానన్నారు..నారాయణలో 6 ,50 ,000 వేల మంది విద్యార్థులు ,50,000 వేల మంది ఉపాధ్యాయులు ఉన్నారని తెలిపారు..సీటీలోని ప్రభుత్వ పాఠశాలలను అంతర్జాతీయ ప్రమాణాలతో సిద్ధం చేయాలన్నదే తన లక్ష్యం అని తెలిపారు. అందులో భాగంగానే వీఆర్సీ ని అన్ని హంగులతో ప్రారంభించామన్నారు.యువనేత లోకేష్ సహకారంతో మరో పది హేను హైస్కూల్స్ ని వచ్చే విద్యాసంవత్సరానికి వీఆర్సీ తరహాలో రెడీ చేస్తామన్నారు.50 వేల చదరపు అడుగుల్లో నిర్మాణాలు చేపట్టి నూతన శోభ తెస్తామన్నారు.స్కూల్స్ ని దత్తత తీసుకొనేందుకు ముందుకు వచ్చిన దాతలకు మంత్రి నారాయణ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.ఈనెల నుంచి పదిహేను హైస్కూల్స్ లో ఫౌండేషన్ కోర్సు ప్రారంభిస్తామన్నారు.నారాయణ ఫ్యాకల్టీ ఉపాధ్యాయులకు శిక్షణ ఇస్తారన్నారు.నారాయణ స్టడీ మెటీరియల్ ఉచితంగా అందిస్తామని..ప్రభుత్వ పాఠశాలల పిల్లలకు నారాయణ విద్యాసంస్థల సహకారం ఎల్లప్పుడూ ఉంటుందిని తెలిపారు .
ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులు ఫౌండేషన్ కోర్స్ కి సహకరించాలన్నారు..మా నాన్న ప్రయివేట్ బస్సు కండక్టర్ అని తెలియజేశారు..మా అమ్మ అంతగా చదువుకోలేదని..పేదరికం నుంచి వచ్చి ఈ స్థాయికి ఎదిగానాని తెలిపారు..పెదరికం ఎదుగుదలకు ఆటంకం కాదన్నారు..బాగా చదువుకొంటే పేదరికాన్ని జయించి ఉన్నతస్థాయికి ఎదగొచ్చన్నారు..సీఎం ప్రవేశ పెట్టిన పి 4 ద్వారా పేదల అభ్యున్నతికి కృషిచేస్తున్నామన్నారు.నుడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి మాట్లాడుతూ…… రాష్ట్రాభివృద్దితో పాటు నగరాభివృద్ధికి మంత్రి నారాయణ కృషిచేస్తున్నారని..పేదపిల్లలకు ఉన్నత విద్య అందించటంపై దృష్టిపెట్టారన్నారు.. నారాయణ విద్యాసంస్థల కంటే గొప్పగా ప్రభుత్వ స్కూల్స్ ని సిద్ధం చేస్తున్నారని..పేదకుటుంబంనుంచి వచ్చి ఉన్నత స్థాయికి ఎదిగానని చెప్పుకొనే గొప్పవ్యక్తి మంత్రి ని తెలిపారు.డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్ మాట్లాడరూ…. అత్యధిక మెజారిటీతో గెలిపించిన నగర వాసుల అభ్యున్నతికి మంత్రి నారాయణ కృషి చేస్తున్నారని, విద్యాశాఖామంత్రి నారా లోకేష్ సహకారంతో విద్యావ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తేస్తున్నారని తెలిపారు.మూతపడ్డ విఆర్సీని అంతర్జాతీయ ప్రమాణాలతో సిద్ధం చేసారని..మరో పదిహేను హై స్కూల్స్ ను విఆర్సీ తరహాలో ఆధునీకరిస్తున్నారని..ఆర్ ఎస్ ఆర్ స్కూల్ ఆధునీకరకు ముందుకొచ్చిన ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసారు.
ఈ కార్యక్రమంలో కార్పొరేషన్ కమీషనర్ నందన్, డిఈఓ బాలరాజు ,నుడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి ,డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్ ,బీజేపీ రాష్ట్…

  • Related Posts

    శ్రీ గౌరీ శంకర్ మహోత్సవాలలో పాల్గొన్న వైసీపీ నాయకులు మురళి రాజు

    మన ధ్యాస ప్రతినిథి ఏలేశ్వరం ;ఏలేశ్వరం నగర పంచాయతీ శ్రీ గౌరీ శంకర్ మహోత్సవాల్లో, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ముదునూరి మురళి కృష్ణంరాజు పాలుపంచుకున్నారు. ఏలేశ్వరం నగర పంచాయతీ లో శ్రీ గౌరీ శంకర్ ఆలయ కమిటీ ఆహ్వానం మేరకు…

    పెద్దిపాలెంలో అగ్ని ప్రమాద బాధితులను పరామర్శించిన జనసేన నేత బార్లపూడి క్రాంతి

    బాధిత కుటుంబాలకు రూ. 35 వేలు ఆర్థిక సాయం మన ధ్యాస ప్రతినిథి ప్రత్తిపాడు ప్రత్తిపాడు మండలం పెద్దిపాలెం గ్రామంలో శుక్రవారం అర్ధరాత్రి జరిగిన అగ్నిప్రమాదంలో సర్వం కోల్పోయి నిరాశ్రయులైన కుటుంబాలను జనసేన నాయకురాలు బార్లపూడి క్రాంతి పరామర్శించారు.సర్వం కోల్పోయిన మూడు…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    జిర్రవారపాలెం లో టీడీపీ పార్టీ కార్యకర్త గోసాల మల్లికార్జున మృతి,ఆయన కుటుంబ సభ్యలును పరమర్శించిన బిజ్జం వెంకట కృష్ణారెడ్డి.

    జిర్రవారపాలెం లో టీడీపీ పార్టీ కార్యకర్త గోసాల మల్లికార్జున మృతి,ఆయన కుటుంబ సభ్యలును పరమర్శించిన బిజ్జం వెంకట కృష్ణారెడ్డి.

    శ్రీ గౌరీ శంకర్ మహోత్సవాలలో పాల్గొన్న వైసీపీ నాయకులు మురళి రాజు

    శ్రీ గౌరీ శంకర్ మహోత్సవాలలో పాల్గొన్న వైసీపీ నాయకులు మురళి రాజు

    పెద్దిపాలెంలో అగ్ని ప్రమాద బాధితులను పరామర్శించిన జనసేన నేత బార్లపూడి క్రాంతి

    పెద్దిపాలెంలో అగ్ని ప్రమాద బాధితులను పరామర్శించిన జనసేన నేత బార్లపూడి క్రాంతి

    24,50,339 రూపాయల సిఎంఆర్ఎఫ్ చెక్కులు అందచేసిన:ఎమ్మెల్యే

    24,50,339 రూపాయల సిఎంఆర్ఎఫ్ చెక్కులు అందచేసిన:ఎమ్మెల్యే

    తవణంపల్లి మండలంలో 17 ఏళ్ల యువకుడు అదృశ్యం కేసు నమోదు

    తవణంపల్లి మండలంలో 17 ఏళ్ల యువకుడు అదృశ్యం కేసు నమోదు

    కొత్తగా వచ్చిన ఉపాధ్యాయులకు పి.ఆర్‌.టి.యు సముచిత స్థానం

    కొత్తగా వచ్చిన ఉపాధ్యాయులకు పి.ఆర్‌.టి.యు సముచిత స్థానం