మెగాస్టార్ చిరంజీవి ఓకే చేసిన కథతో “డ్రింకర్ సాయి” సినిమా రూపొందించాం – ట్రైలర్ లాంఛ్ లో డైరెక్టర్ కిరణ్ తిరుమలశెట్టి

Mana Cinema :- ధర్మ, ఐశ్వర్య శర్మ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న సినిమా “డ్రింకర్ సాయి”. బ్రాండ్ ఆఫ్ బ్యాడ్ బాయ్స్ అనేది ఈ చిత్ర ట్యాగ్ లైన్. ఈ చిత్రాన్ని ఎవరెస్ట్ సినిమాస్, స్మార్ట్ స్క్రీన్ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్స్ పై బసవరాజు శ్రీనివాస్, ఇస్మాయిల్ షేక్, బసవరాజు లహరిధర్ నిర్మిస్తున్నారు. కొన్ని వాస్తవ ఘటనల ఆధారంగా దర్శకుడు కిరణ్ తిరుమలశెట్టి ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఈ నెల 27న ఈ సినిమా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అ‌వుతోంది. ఈ రోజు “డ్రింకర్ సాయి” సినిమా ట్రైలర్ ను హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్ లో విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో డీవోపీ ప్రశాంత్ అంకిరెడ్డి మాట్లాడుతూ – “డ్రింకర్ సాయి” సినిమాకు వర్క్ చేయడం హ్యాపీగా ఉంది. చాలా బ్యూటిఫుల్ మూవీ ఇది. ఈ నెల 27న థియేటర్స్ కు వెళ్లి తప్పకుండా చూడండి. మీరంతా ఎంజాయ్ చేస్తారు.అన్నారు. నిర్మాత ఇస్మాయిల్ షేక్ మాట్లాడుతూ – “డ్రింకర్ సాయి” సినిమా కథను ఎంతబాగా చెప్పారో అంతకంటే బాగా రూపొందించారు మా డైరెక్టర్ కిరణ్ గారు. ఈ సినిమాను బాగా తెరకెక్కించడం కోసం టీమ్ లోని ప్రతి ఒక్కరూ శ్రమించారు. చంద్రబోస్ గారు ఆరు పాటలను అద్భుతంగా రాశారు. అవన్నీ కథను మరింత ఎలివేట్ చేసేలా ఉంటాయి. ధర్మ ఎంతో డెడికేటెడ్ గా వర్క్ చేశాడు. అడిగి మరీ రీటేక్స్ చేసేవాడు. “డ్రింకర్ సాయి” వంటి ఒక మంచి మూవీతో మీ ముందుకు ఈ నెల 27న వస్తున్నాం. మీ సపోర్ట్ అందిస్తారని కోరుకుంటున్నాం. అన్నారు. నిర్మాత లహరిధర్ మాట్లాడుతూ – “డ్రింకర్ సాయి” సినిమా ట్రైలర్ లో ఎలాంటి ఇంట్రెస్టింగ్ కంటెంట్ ఉందో సినిమాలోనూ అలాంటి కంటెంట్ చూస్తారు. థియేటర్స్ లో మా మూవీని ఎంజాయ్ చేస్తారు. ఫ్యామిలీ ఆడియెన్స్ తో పాటు యూత్ కు బాగా నచ్చేలా సినిమా ఉంటుంది. మా టీమ్ అందరికీ థ్యాంక్స్. అన్నారు. నటి కిర్రాక్ సీత మాట్లాడుతూ – “డ్రింకర్ సాయి” సినిమాలో ఒక మంచి రోల్ లో నటించే అవకాశం ఇచ్చిన మా డైరెక్టర్ కిరణ్ గారికి థ్యాంక్స్. నేను ఇప్పటిదాకా చేసిన క్యారెక్టర్స్ కు భిన్నమైన రోల్ ఈ చిత్రంలో చేశాను. హీరో ధర్మ, హీరోయిన్ ఐశ్వర్య..ఆకట్టుకునేలా పర్ ఫార్మ్ చేశారు. అన్నారు. డైరెక్టర్ కిరణ్ తిరుమలశెట్టి మాట్లాడుతూ – “డ్రింకర్ సాయి” ట్రైలర్ మీ అందరికీ నచ్చిందని భావిస్తున్నా. ఈ సినిమా ప్రొడ్యూసర్ బసవరాజు లహరిధర్ వాళ్ల నాన్నగారు శ్రీనివాస్ గారికి మెగాస్టార్ చిరంజీవి గారు మంచి మిత్రులు. నేను ఈ కథను శ్రీనివాస్ గారికి చెప్పినప్పుడు చిరంజీవికి చెబుదాం ఆయన ఒపీనియన్ తీసుకుందాం అన్నారు. అప్పుడు నేను కథలో సోషల్ ఎలిమెంట్ యాడ్ చేస్తూ రీ రైట్ చేశాను. ఆ తర్వాత “డ్రింకర్ సాయి” కథ చాలా బాగుందని జీకే మోహన్ గారు చిరంజీవి గారికి మెసేజ్ పంపిస్తే ఆయన ఓకే అని రిప్లై ఇచ్చారు. అలా మెగాస్టార్ గారి అంగీకారంతో “డ్రింకర్ సాయి” సినిమా మొదలైంది. ఆయన నో చెప్పి ఉంటే ఈ సినిమా ఉండేది కాదు. ధర్మ సత్యానంద్ గారి దగ్గర ట్రైనింగ్ తీసుకున్నాడు. గోల్డ్ మెడల్ సాధించాడు. సత్యానంద్ గారి దగ్గరి శిక్షణ తీసుకున్న వాళ్లలో ప్రభాస్ తర్వాత ధర్మ పేరే చెబుతారు. ఈ సినిమాకు ధర్మ ఎంతో డెడికేటెడ్ గా వర్క్ చేశాడు. హీరోయిన్ ఐశ్వర్యను చూడగానే నా కథలోని బాగీ క్యారెక్టర్ కు సరిగ్గా సరిపోతుంది అనిపించింది. ఆమె తెలుగు రాకున్నా అద్భుతంగా పర్ ఫార్మ్ చేసింది. ఎడిటర్ మార్తాండ్ కె వెంకటేష్ గారు, లిరిసిస్ట్ చంద్రబోస్ గారు మాకు ఎంతో సపోర్ట్ చేశారు వారికి థ్యాంక్స్ చెబుతున్నా. యూత్ ఆడియెన్స్ ను థియేటర్స్ కు రప్పించేందుకే కొంత యూత్ ఫుల్ కంటెంట్ పెట్టాల్సివచ్చింది. థియేటర్స్ కు వచ్చాక డెఫనెట్ గా బాగుందని అంటారు. ఈ సినిమా చూశాక ఒక మంచి మూవీ చేశావని మీడియా మిత్రులు తప్పకుండా నన్ను ప్రశంసిస్తారు. ఆ నమ్మకం నాకు ఉంది. అన్నారు. ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ లక్ష్మీ మాట్లాడుతూ – కథలో దమ్ముంటే చిన్న చిత్రాలను కూడా ప్రేక్షకులు బాగా ఆదరిస్తారు. అలాంటి మంచి కంటెట్ మా “డ్రింకర్ సాయి” మూవీలో ఉంది. ట్రైలర్ చూసి ఇది ఒక సెక్షన్ ఆడియెన్స్ కోసం అనుకోకండి. ఫ్యామిలీ అంతా కలిసి ఈ సినిమాను చూడొచ్చు. అన్నారు. హీరోయిన్ ఐశ్వర్య శర్మ మాట్లాడుతూ – “డ్రింకర్ సాయి” సినిమా ట్రైలర్ మీ అందరి సమక్షంలో రిలీజ్ చేసుకోవడం సంతోషంగా ఉంది. నాకు ఈ మూవీలో నటించే అవకాశం ఇచ్చిన డైరెక్టర్, ప్రొడ్యూసర్స్ థ్యాంక్స్. నాకు తెలుగు రాదు. ముంబై నుంచి వచ్చాను. నా ఫ్యామిలీ మెంబర్స్ ఎంతో సపోర్ట్ చేశారు. సెట్ లో తెలుగు డైలాగ్స్ నేర్చుకునేందుకు ధర్మ హెల్ప్ చేశాడు. అలాంటి మంచి కోస్టార్ దొరికినందుకు హ్యాపీగా ఉంది. కిర్రాక్ సీత నా…

  • Related Posts

    సంజోష్ తగరం హీరోగా పరిచయం అవుతున్న ‘మై లవ్’ చిత్రం ఘనంగా ప్రారంభం

    సంజోష్ తగరం, హర్షిత హీరో–హీరోయిన్లుగా ‘జోష్’ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ప్రొడక్షన్ పతాకంపై రూపొందుతున్న నూతన చిత్రం ‘మై లవ్’ తాజాగా ఘనంగా ప్రారంభమైంది. ఈ చిత్రానికి ఐటీ & ఇండస్ట్రీస్ మంత్రి దుద్దిల్లా శ్రీధర్ బాబు క్లాప్ కొట్టగా, జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే…

    మెర్సీ కిల్లింగ్ సినిమాలో నటించిన బేబి హారిక కు ప్రతిష్టాత్మక గద్దర్ అవార్డ్ !!!

    Mana News, Mana Cinema :-తెలంగాణ ప్రభుత్వం తెలుగు చిత్ర పరిశ్రమకు అందిస్తున్న ప్రతిష్టాత్మక గద్దర్ అవార్డ్స్ లో మెర్సీ కిల్లింగ్ సినిమాలో నటించిన బేబి హారికకు ఉత్తమ చైల్డ్ ఆర్టిస్టు కేటగిరిలో గద్దర్ అవార్డ్స్ వరించడం విశేషం. సాయి సిద్ధార్ద్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ చేతుల మీదుగా 74 మందిలబ్ధి దారులుకు సీఎం ఆర్ ఎఫ్, చెక్కుల పంపిణీ.

    ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ చేతుల మీదుగా 74 మందిలబ్ధి దారులుకు సీఎం ఆర్ ఎఫ్, చెక్కుల పంపిణీ.

    మేకపాటి శాంత కుమారి కి జిల్లా గ్రంథాలయ చైర్మన్ పదవి.

    మేకపాటి శాంత కుమారి కి జిల్లా గ్రంథాలయ చైర్మన్ పదవి.

    ఎన్నికల విధుల పట్ల నిర్లక్ష్యం,74 మందికి షోకాజ్ నోటీసులు జారీ చేసిన జిల్లా కలెక్టర్ సిక్త పట్నాయక్.

    ఎన్నికల విధుల పట్ల నిర్లక్ష్యం,74 మందికి  షోకాజ్ నోటీసులు జారీ చేసిన  జిల్లా కలెక్టర్ సిక్త పట్నాయక్.

    విజయోత్సవ ర్యాలీలు పూర్తిగా నిషేధం: ఎస్పీ డాక్టర్ వినీత్.

    విజయోత్సవ ర్యాలీలు పూర్తిగా నిషేధం: ఎస్పీ డాక్టర్ వినీత్.

    పంచాయతీ ఎన్నికల బందోబస్తు నిర్వహణలో పోలీసుల సేవలు ప్రశంసనీయం.

    పంచాయతీ ఎన్నికల బందోబస్తు నిర్వహణలో పోలీసుల సేవలు ప్రశంసనీయం.

    ఎలక్షన్ సరళి, పోలీసు బందోబస్తు ఏర్పాట్లను పరిశీలించిన: జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్.

    ఎలక్షన్ సరళి, పోలీసు బందోబస్తు ఏర్పాట్లను పరిశీలించిన: జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్.