ఫిజియోథెరపీ విద్య కావలి కే గర్వకారణంతొలి గ్రాడ్యుయేషన్ లో ప్రశంసలు..

కావలి, మన ధ్యాస న్యూస్, డిసెంబర్ 06,(కె నాగరాజు) అన్నిరకాల విద్యలు ఉన్న కావలిలో తొలి సారిగా ఫిజియోథెరపీ విద్యను ప్రవేశపెట్టి విజయవంతం గా నిర్వహిస్తున్న డాక్టర్ మాధవరెడ్డి కి అభినందనీయులు అని యమ్ యల్ ఎ డి.వి.క్రిష్ణారెడ్డి,ఆర్ డి ఒ వంశీకృష్ణ అభినందించారు.శ్రీ లక్ష్మి ఫిజియోథెరపీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ తొలి స్నాతకోత్సవ కార్యక్రమం లో ఆయన ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.ఫిజియోథెరపీ కోసం కావలి వాసులు దూర ప్రాంతాలకు పోయేందుకు అనేక వ్యయ ప్రయాసలకు లోను అవుతున్న తరుణంలో మాధవరెడ్డి కావలి లో ఈ విద్యా కేంద్రం ఏర్పాటు చేయడమే కాక ఫిజియోథెరపీ వైద్యం అందుబాటులోకి తేవడం సామాన్య మైన విషయం కాదని అన్నారు.యువతకు సులభంగా ఉపాధి అవకాశాలు కలిగించే క్రమంలో లక్ష్మి ఫిజియోథెరపీ ఇన్స్టిట్యూట్ మరింత ఉన్నత స్థాయి కి ఎదగాలని క్రిష్ణా రెడ్డి, వంశీకృష్ణ లు కోరారు. కళాశాల ప్రిన్సిపాల్ అండ్ కరస్పాండెంట్ మాధవరెడ్డి మాట్లాడుతూ 2000 సంవత్సరం లో ఈ ఇన్స్టిట్యూట్ ప్రారంభం లో కావలి లో ఎందుకు అని పేరు పలువురు శ్రేయోభిలాషులు వారించారని, జన్మభూమి అయిన కావలి ప్రాంతంలో తాను నేర్చుకున్న విద్య పలువురికి అందించాలనే లక్ష్యంతో ఎన్నో ఇబ్బందుల మధ్య మొదలు పెట్టిన సంస్థ అనుకున్న లక్ష్యాన్ని సాధించిందని తెలిపారు. యన్ టి ఆర్ హెల్త్ యూనివర్సిటీ కి అనుబంధం గా ఉన్న తమ ఇన్స్టిట్యూట్ విద్యార్థులు యూనివర్సిటీ స్థాయిలో ప్రధమ ర్యాంకు పొందారని హర్షధ్వానాల మధ్య ప్రకటించారు. భవిష్యత్తు లో అందరి ఆశీస్సులతో మరిన్ని విజయాలు సాధిస్తామని, తన తండ్రి నారాయణ రెడ్డి ఆశయం నెరవేరుస్తామని మాధవ రెడ్డి తెలిపారు.ఈ సందర్భంగా స్నానకోత్సవంలో విద్యార్థులకు యమ్ యల్ ఎ క్రిష్ణా రెడ్డి,ఆర్ డి ఒ వంశీ కృష్ణ పంపిణీ చేశారు.కార్యక్రమంలో అకడమిక్ డైరెక్టర్ డాక్టర్ ఆనంద్ మాధవరెడ్డి అంకిత భావంతో ఎంతటి బాధ్యత అయినా చేస్తారని ఆయన పై విశ్వాసం తో తాను భాగస్వామిని అయ్యానని ఈ విజయం తనకు ఎంతో ఆనందంగా ఉందని అన్నారు.అడ్మినిస్ట్రేటివ్ డైరెక్టర్ డాక్టర్ యస్.గోపి కన్నన్ నేతృత్వంలో విద్యార్థుల, తల్లి తండ్రుల, సన్నిహితుల మధ్య తొలి స్నాతకోత్సవం విజయవంతం గా ముగిసింది అన్నారు.

  • Related Posts

    శ్రీ గౌరీ శంకర్ మహోత్సవాలలో పాల్గొన్న వైసీపీ నాయకులు మురళి రాజు

    మన ధ్యాస ప్రతినిథి ఏలేశ్వరం ;ఏలేశ్వరం నగర పంచాయతీ శ్రీ గౌరీ శంకర్ మహోత్సవాల్లో, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ముదునూరి మురళి కృష్ణంరాజు పాలుపంచుకున్నారు. ఏలేశ్వరం నగర పంచాయతీ లో శ్రీ గౌరీ శంకర్ ఆలయ కమిటీ ఆహ్వానం మేరకు…

    పెద్దిపాలెంలో అగ్ని ప్రమాద బాధితులను పరామర్శించిన జనసేన నేత బార్లపూడి క్రాంతి

    బాధిత కుటుంబాలకు రూ. 35 వేలు ఆర్థిక సాయం మన ధ్యాస ప్రతినిథి ప్రత్తిపాడు ప్రత్తిపాడు మండలం పెద్దిపాలెం గ్రామంలో శుక్రవారం అర్ధరాత్రి జరిగిన అగ్నిప్రమాదంలో సర్వం కోల్పోయి నిరాశ్రయులైన కుటుంబాలను జనసేన నాయకురాలు బార్లపూడి క్రాంతి పరామర్శించారు.సర్వం కోల్పోయిన మూడు…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    జిర్రవారపాలెం లో టీడీపీ పార్టీ కార్యకర్త గోసాల మల్లికార్జున మృతి,ఆయన కుటుంబ సభ్యలును పరమర్శించిన బిజ్జం వెంకట కృష్ణారెడ్డి.

    జిర్రవారపాలెం లో టీడీపీ పార్టీ కార్యకర్త గోసాల మల్లికార్జున మృతి,ఆయన కుటుంబ సభ్యలును పరమర్శించిన బిజ్జం వెంకట కృష్ణారెడ్డి.

    శ్రీ గౌరీ శంకర్ మహోత్సవాలలో పాల్గొన్న వైసీపీ నాయకులు మురళి రాజు

    శ్రీ గౌరీ శంకర్ మహోత్సవాలలో పాల్గొన్న వైసీపీ నాయకులు మురళి రాజు

    పెద్దిపాలెంలో అగ్ని ప్రమాద బాధితులను పరామర్శించిన జనసేన నేత బార్లపూడి క్రాంతి

    పెద్దిపాలెంలో అగ్ని ప్రమాద బాధితులను పరామర్శించిన జనసేన నేత బార్లపూడి క్రాంతి

    24,50,339 రూపాయల సిఎంఆర్ఎఫ్ చెక్కులు అందచేసిన:ఎమ్మెల్యే

    24,50,339 రూపాయల సిఎంఆర్ఎఫ్ చెక్కులు అందచేసిన:ఎమ్మెల్యే

    తవణంపల్లి మండలంలో 17 ఏళ్ల యువకుడు అదృశ్యం కేసు నమోదు

    తవణంపల్లి మండలంలో 17 ఏళ్ల యువకుడు అదృశ్యం కేసు నమోదు

    కొత్తగా వచ్చిన ఉపాధ్యాయులకు పి.ఆర్‌.టి.యు సముచిత స్థానం

    కొత్తగా వచ్చిన ఉపాధ్యాయులకు పి.ఆర్‌.టి.యు సముచిత స్థానం