అన్ని వసతులు కల్పిస్తున్నాం, బాగా చదువుకోండి,జిల్లా పరిషత్ పాఠశాల విద్యా కమిటీ చైర్మన్ సుందరయ్యయాదవ్..

జలదంకి,మన ధ్యాస న్యూస్, డిసెంబర్ 06,(కె నాగరాజు)

పాఠశాలలో అన్ని వసతులు కల్పించామని, విద్యార్థులు బాగా చదివి పాఠశాలకు మంచి పేరు తేవాలని జలదంకి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యా కమిటీ చైర్మన్ మారుబోయిన సుందరయ్య తెలిపారు. శుక్రవారం మెగా పిటీఎం కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థుల తల్లిదండ్రులు కూడా తమ పిల్లలు ఎలా చదువుతున్నారు అనే విషయంపై దృష్టి పెట్టాలన్నారు. సోమశిల ప్రాజెక్టు కమిటీ ఉపాధ్యక్షులు పూర్వ విద్యార్థి అయిన పులిగుంట మధుమోహన్ రెడ్డి మాట్లాడుతూ చదువు చెప్పే మంచి ఉపాధ్యాయులు పాఠశాలలో ఉన్నారని, వారి సేవలను విద్యార్థులు ఉపయోగించుకోవాలన్నారు. పాఠశాలలో ఏమైనా ఇబ్బందులు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని పూర్వ విద్యార్థులతో కలిసి సమస్యలు పరిష్కరిస్తామని అన్నారు. బిజెపి నాయకులు వడ్డే శ్రీనాథ్ రెడ్డి మాట్లాడుతూ మన భారత దేశంలో ఉన్న విద్యా వ్యవస్థ అన్ని దేశాలకు ఆదర్శమన్నారు. తక్షశిల, నలందా వంటి విశ్వవిద్యాలయాలలో చదివేందుకు ఇతర దేశాల నుంచి విద్యార్థులు వస్తున్నారన్నారు. విద్యార్థులు ఏ స్థాయికి ఎదిగిన తమకు సాయం చేసిన వారిని ఎన్నటికీ మరువ వద్దన్నారు. ఈ కార్యక్రమంలో హెడ్మాస్టర్ వింజావళి,విద్యార్థుల సంఘం అధ్యక్షులు హరినారపు రెడ్డి, మద్దుల లక్ష్మీనరసింహం, జలదంకి ఎంపీటీసీ కుట్టు బోయిన మాధవరావు యాదవ్, ఉప సర్పంచ్ కూరపాటి మాలకొండ రెడ్డి,,హైస్కూల్ వైస్ చైర్మన్ ఏగురి జయ కుమారి, పాఠశాల స్టాప్ సెక్రెటరీ డి, తిరుపతయ్య, ఉపాధ్యాయులు టి. శ్రీనివాసులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు

  • Related Posts

    జిర్రవారపాలెం లో టీడీపీ పార్టీ కార్యకర్త గోసాల మల్లికార్జున మృతి,ఆయన కుటుంబ సభ్యలును పరమర్శించిన బిజ్జం వెంకట కృష్ణారెడ్డి.

    గోసాల మల్లికార్జున కుటుంబ సభ్యుల ను పరామర్శించిన కలిగిరి తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు బిజ్జం వెంకట కృష్ణరెడ్డి. కలిగిరి,మనధ్యాసన్యూస్, డిసెంబర్ 7, (కె నాగరాజు). ఉదయగిరి నియోజకవర్గం లోని కలిగిరి మండలం కలిగిరి గ్రామపంచాయతీ నందు జిరావారిపాలెం గ్రామానికి చెందిన గోసాల…

    ఫిజియోథెరపీ విద్య కావలి కే గర్వకారణంతొలి గ్రాడ్యుయేషన్ లో ప్రశంసలు..

    కావలి,మనధ్యాసన్యూస్,డిసెంబర్ 06,(కె నాగరాజు) అన్నిరకాల విద్యలు ఉన్న కావలిలో తొలి సారిగా ఫిజియోథెరపీ విద్యను ప్రవేశపెట్టి విజయవంతం నిర్వహిస్తున్న డాక్టర్ మాధవరెడ్డి అభినందనీయులు అని యమ్ యల్ ఎ డి.వి.క్రిష్ణారెడ్డి,ఆర్ డి ఒ వంశీకృష్ణ అభినందించారు. శ్రీ లక్ష్మి ఫిజియోథెరపీ ఇన్స్టిట్యూట్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    జిర్రవారపాలెం లో టీడీపీ పార్టీ కార్యకర్త గోసాల మల్లికార్జున మృతి,ఆయన కుటుంబ సభ్యలును పరమర్శించిన బిజ్జం వెంకట కృష్ణారెడ్డి.

    జిర్రవారపాలెం లో టీడీపీ పార్టీ కార్యకర్త గోసాల మల్లికార్జున మృతి,ఆయన కుటుంబ సభ్యలును పరమర్శించిన బిజ్జం వెంకట కృష్ణారెడ్డి.

    శ్రీ గౌరీ శంకర్ మహోత్సవాలలో పాల్గొన్న వైసీపీ నాయకులు మురళి రాజు

    శ్రీ గౌరీ శంకర్ మహోత్సవాలలో పాల్గొన్న వైసీపీ నాయకులు మురళి రాజు

    పెద్దిపాలెంలో అగ్ని ప్రమాద బాధితులను పరామర్శించిన జనసేన నేత బార్లపూడి క్రాంతి

    పెద్దిపాలెంలో అగ్ని ప్రమాద బాధితులను పరామర్శించిన జనసేన నేత బార్లపూడి క్రాంతి

    24,50,339 రూపాయల సిఎంఆర్ఎఫ్ చెక్కులు అందచేసిన:ఎమ్మెల్యే

    24,50,339 రూపాయల సిఎంఆర్ఎఫ్ చెక్కులు అందచేసిన:ఎమ్మెల్యే

    తవణంపల్లి మండలంలో 17 ఏళ్ల యువకుడు అదృశ్యం కేసు నమోదు

    తవణంపల్లి మండలంలో 17 ఏళ్ల యువకుడు అదృశ్యం కేసు నమోదు

    కొత్తగా వచ్చిన ఉపాధ్యాయులకు పి.ఆర్‌.టి.యు సముచిత స్థానం

    కొత్తగా వచ్చిన ఉపాధ్యాయులకు పి.ఆర్‌.టి.యు సముచిత స్థానం