ఏలేశ్వరంలో దోమల నివారణకు మున్సిపల్ కమిషనర్ పిలుపు

మన ధ్యాస ప్రతినిథి ఏలేశ్వరం : ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని, ఏలేశ్వరం మున్సిపల్ కమిషనర్ పి సూర్య ప్రకాష్ మంగళవారం పట్టణంలో ప్రత్యేక పారిశుధ్య డ్రైవ్‌ను ప్రారంభించారు. 16వ వార్డులో మున్సిపల్ కార్మికులతో కలిసి ఈ కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ మాట్లాడుతూ. పరిసరాల పరిశుభ్రతతోనే డెంగీ, మలేరియా వంటి అంటువ్యాధులకు దూరంగా ఉండవచ్చని ఉద్ఘాటించారు. పట్టణ ప్రజలు తమ ఇళ్ల వద్ద, పరిసర ప్రాంతాలలో తప్పనిసరిగా శుభ్రత పాటించాలన్నారు. ముఖ్యంగా, దోమలు వృద్ధి చెందేందుకు కారణమయ్యే ఖాళీ టైర్లు, పాత కూలర్లు, కొబ్బరి బొండాల వెంటనే తొలగించాలని ఆయన కోరారు.కాలువల్లో చెత్తాచెదారం వేయడం వలన నీరు నిలిచిపోయి, దుర్వాసనతో పాటు దోమలు ఉత్పత్తి అవుతాయని, తద్వారా తీవ్ర జ్వరాలు వచ్చే ప్రమాదం ఉందని హెచ్చరించారు. కాబట్టి, పట్టణ ప్రజలు కనిగిరి అభివృద్ధికి సహకరించి, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో శానిటేషన్ సిబ్బంది పాల్గొన్నారు.

  • Related Posts

    శ్రీ గౌరీ శంకర్ మహోత్సవాలలో పాల్గొన్న వైసీపీ నాయకులు మురళి రాజు

    మన ధ్యాస ప్రతినిథి ఏలేశ్వరం ;ఏలేశ్వరం నగర పంచాయతీ శ్రీ గౌరీ శంకర్ మహోత్సవాల్లో, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ముదునూరి మురళి కృష్ణంరాజు పాలుపంచుకున్నారు. ఏలేశ్వరం నగర పంచాయతీ లో శ్రీ గౌరీ శంకర్ ఆలయ కమిటీ ఆహ్వానం మేరకు…

    పెద్దిపాలెంలో అగ్ని ప్రమాద బాధితులను పరామర్శించిన జనసేన నేత బార్లపూడి క్రాంతి

    బాధిత కుటుంబాలకు రూ. 35 వేలు ఆర్థిక సాయం మన ధ్యాస ప్రతినిథి ప్రత్తిపాడు ప్రత్తిపాడు మండలం పెద్దిపాలెం గ్రామంలో శుక్రవారం అర్ధరాత్రి జరిగిన అగ్నిప్రమాదంలో సర్వం కోల్పోయి నిరాశ్రయులైన కుటుంబాలను జనసేన నాయకురాలు బార్లపూడి క్రాంతి పరామర్శించారు.సర్వం కోల్పోయిన మూడు…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    జిర్రవారపాలెం లో టీడీపీ పార్టీ కార్యకర్త గోసాల మల్లికార్జున మృతి,ఆయన కుటుంబ సభ్యలును పరమర్శించిన బిజ్జం వెంకట కృష్ణారెడ్డి.

    జిర్రవారపాలెం లో టీడీపీ పార్టీ కార్యకర్త గోసాల మల్లికార్జున మృతి,ఆయన కుటుంబ సభ్యలును పరమర్శించిన బిజ్జం వెంకట కృష్ణారెడ్డి.

    శ్రీ గౌరీ శంకర్ మహోత్సవాలలో పాల్గొన్న వైసీపీ నాయకులు మురళి రాజు

    శ్రీ గౌరీ శంకర్ మహోత్సవాలలో పాల్గొన్న వైసీపీ నాయకులు మురళి రాజు

    పెద్దిపాలెంలో అగ్ని ప్రమాద బాధితులను పరామర్శించిన జనసేన నేత బార్లపూడి క్రాంతి

    పెద్దిపాలెంలో అగ్ని ప్రమాద బాధితులను పరామర్శించిన జనసేన నేత బార్లపూడి క్రాంతి

    24,50,339 రూపాయల సిఎంఆర్ఎఫ్ చెక్కులు అందచేసిన:ఎమ్మెల్యే

    24,50,339 రూపాయల సిఎంఆర్ఎఫ్ చెక్కులు అందచేసిన:ఎమ్మెల్యే

    తవణంపల్లి మండలంలో 17 ఏళ్ల యువకుడు అదృశ్యం కేసు నమోదు

    తవణంపల్లి మండలంలో 17 ఏళ్ల యువకుడు అదృశ్యం కేసు నమోదు

    కొత్తగా వచ్చిన ఉపాధ్యాయులకు పి.ఆర్‌.టి.యు సముచిత స్థానం

    కొత్తగా వచ్చిన ఉపాధ్యాయులకు పి.ఆర్‌.టి.యు సముచిత స్థానం