
మన ధ్యాస ప్రతినిథి ఏలేశ్వరం : ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని, ఏలేశ్వరం మున్సిపల్ కమిషనర్ పి సూర్య ప్రకాష్ మంగళవారం పట్టణంలో ప్రత్యేక పారిశుధ్య డ్రైవ్‌ను ప్రారంభించారు. 16వ వార్డులో మున్సిపల్ కార్మికులతో కలిసి ఈ కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ మాట్లాడుతూ. పరిసరాల పరిశుభ్రతతోనే డెంగీ, మలేరియా వంటి అంటువ్యాధులకు దూరంగా ఉండవచ్చని ఉద్ఘాటించారు. పట్టణ ప్రజలు తమ ఇళ్ల వద్ద, పరిసర ప్రాంతాలలో తప్పనిసరిగా శుభ్రత పాటించాలన్నారు. ముఖ్యంగా, దోమలు వృద్ధి చెందేందుకు కారణమయ్యే ఖాళీ టైర్లు, పాత కూలర్లు, కొబ్బరి బొండాల వెంటనే తొలగించాలని ఆయన కోరారు.కాలువల్లో చెత్తాచెదారం వేయడం వలన నీరు నిలిచిపోయి, దుర్వాసనతో పాటు దోమలు ఉత్పత్తి అవుతాయని, తద్వారా తీవ్ర జ్వరాలు వచ్చే ప్రమాదం ఉందని హెచ్చరించారు. కాబట్టి, పట్టణ ప్రజలు కనిగిరి అభివృద్ధికి సహకరించి, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో శానిటేషన్ సిబ్బంది పాల్గొన్నారు.