నెల్లూరులో మంది అరేబియన్ రెస్టారెంట్ శుభారంభం

మన ధ్యాస,నెల్లూరు., డిసెంబర్ 1మంది అరేబియన్ రెస్టారెంట్ ను సింహపురి ఆహార ప్రియులు సందర్శించి ఆదరించాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ పిలుపునిచ్చారు. నెల్లూరు నగరంలోని స్థానిక గాంధీ బొమ్మ సెంటర్ ప్రాంతంలో నిర్వాహకుల ఆధ్వర్యంలో మంది అరేబియన్ రెస్టారెంట్ ను సింహపురి ఆహార ప్రియులకు అందుబాటులోకి తీసుకువచ్చారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి నారాయణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నెల్లూరు అంటేనే ఆహార రుచులకు పెట్టిన పేరు అని అన్నారు. నెల్లూరు చేపల పులుసు అంటే ప్రపంచంలోనే గుర్తింపు ఉందన్నారు. అటువంటి సింహపురిలో నూతన వెరైటీతో, అధునాతన సదుపాయాలతో నెల్లూరు నగర్ నడిబొడ్డున ఏర్పాటైన మంది అరేబియన్ రెస్టారెంట్ రుచులను సింహపురి యువత రుచి చూడాల్సిందేనన్నారు. ఓకే ప్లేట్ పై కుటుంబంలోనే భార్యాభర్త పిల్లలు సుమారు 5 మంది వరకు కూర్చుని తినగలిగే వెరైటీ చికెన్ బిర్యాని, మటన్ బిర్యానీలను నిర్వాహకులు అందుబాటులోకి తీసుకోవడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మంత్రి నారాయణ తో పాటు టిడిపి నేతలు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

  • Related Posts

    శ్రీ గౌరీ శంకర్ మహోత్సవాలలో పాల్గొన్న వైసీపీ నాయకులు మురళి రాజు

    మన ధ్యాస ప్రతినిథి ఏలేశ్వరం ;ఏలేశ్వరం నగర పంచాయతీ శ్రీ గౌరీ శంకర్ మహోత్సవాల్లో, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ముదునూరి మురళి కృష్ణంరాజు పాలుపంచుకున్నారు. ఏలేశ్వరం నగర పంచాయతీ లో శ్రీ గౌరీ శంకర్ ఆలయ కమిటీ ఆహ్వానం మేరకు…

    పెద్దిపాలెంలో అగ్ని ప్రమాద బాధితులను పరామర్శించిన జనసేన నేత బార్లపూడి క్రాంతి

    బాధిత కుటుంబాలకు రూ. 35 వేలు ఆర్థిక సాయం మన ధ్యాస ప్రతినిథి ప్రత్తిపాడు ప్రత్తిపాడు మండలం పెద్దిపాలెం గ్రామంలో శుక్రవారం అర్ధరాత్రి జరిగిన అగ్నిప్రమాదంలో సర్వం కోల్పోయి నిరాశ్రయులైన కుటుంబాలను జనసేన నాయకురాలు బార్లపూడి క్రాంతి పరామర్శించారు.సర్వం కోల్పోయిన మూడు…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    జిర్రవారపాలెం లో టీడీపీ పార్టీ కార్యకర్త గోసాల మల్లికార్జున మృతి,ఆయన కుటుంబ సభ్యలును పరమర్శించిన బిజ్జం వెంకట కృష్ణారెడ్డి.

    జిర్రవారపాలెం లో టీడీపీ పార్టీ కార్యకర్త గోసాల మల్లికార్జున మృతి,ఆయన కుటుంబ సభ్యలును పరమర్శించిన బిజ్జం వెంకట కృష్ణారెడ్డి.

    శ్రీ గౌరీ శంకర్ మహోత్సవాలలో పాల్గొన్న వైసీపీ నాయకులు మురళి రాజు

    శ్రీ గౌరీ శంకర్ మహోత్సవాలలో పాల్గొన్న వైసీపీ నాయకులు మురళి రాజు

    పెద్దిపాలెంలో అగ్ని ప్రమాద బాధితులను పరామర్శించిన జనసేన నేత బార్లపూడి క్రాంతి

    పెద్దిపాలెంలో అగ్ని ప్రమాద బాధితులను పరామర్శించిన జనసేన నేత బార్లపూడి క్రాంతి

    24,50,339 రూపాయల సిఎంఆర్ఎఫ్ చెక్కులు అందచేసిన:ఎమ్మెల్యే

    24,50,339 రూపాయల సిఎంఆర్ఎఫ్ చెక్కులు అందచేసిన:ఎమ్మెల్యే

    తవణంపల్లి మండలంలో 17 ఏళ్ల యువకుడు అదృశ్యం కేసు నమోదు

    తవణంపల్లి మండలంలో 17 ఏళ్ల యువకుడు అదృశ్యం కేసు నమోదు

    కొత్తగా వచ్చిన ఉపాధ్యాయులకు పి.ఆర్‌.టి.యు సముచిత స్థానం

    కొత్తగా వచ్చిన ఉపాధ్యాయులకు పి.ఆర్‌.టి.యు సముచిత స్థానం