సిగ్నల్ సమస్యల పరిష్కారము నకు బి ఎస్ ఎన్ ఎల్ అధికారులతో – ఎమ్మెల్యే కాకర్ల సురేష్ కీలక భేటీ..!

ఉదయగిరిలో 21 కొత్త బి ఎస్ ఎన్ ఎల్ టవర్లకు పచ్చ జెండా – ఎమ్మెల్యే కాకర్ల సురేష్ ముందడుగు ఇంకా 20 గ్రామాలకు కొత్త టవర్ల ప్రతిపాదన ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని ఎమ్మెల్యే కాకర్ల హామీ సిగ్నల్ లేని గ్రామాలపై ఫోకస్ – టవర్ నిర్మాణానికి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ దిశానిర్దేశం

వింజమూరు నవంబర్ 29, మన ధ్యాస న్యూస్(కె ఎన్ రాజు)://

తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యాలయంలో ఉదయగిరి శాసనసభ్యులు కాకర్ల సురేష్ , బిఎస్ఎన్ఎల్ ఉన్నతాధికారులు మరియు ఉదయగిరి నియోజకవర్గం లోని ఎనిమిది మండలాల ఎమ్మార్వోలతో సమగ్ర సమావేశం నిర్వహించారు.ఈ సమావేశంలో ప్రధానంగా ఉదయగిరి నియోజకవర్గంలో మొబైల్ నెట్‌వర్క్ సమస్యలు, ప్రత్యేకించి సిగ్నల్ అందని గ్రామాలపై విస్తృతంగా చర్చ జరిగింది.సెంట్రల్ గవర్నమెంట్ ప్రత్యేక పథకం కింద బి ఎస్ ఎన్ ఎల్ సంస్థ ఇటీవల చేసిన సర్వేలో మొత్తం 21 గ్రామాలలో కొత్త సెల్ టవర్‌లు నిర్మించాల్సిన అవసరం ఉన్నట్లు గుర్తించారు. ఈ వివరాలను బి ఎస్ ఎన్ ఎల్ డిప్యూటీ జనరల్ మేనేజర్ ఎమ్. శ్రీనివాస్ గారు,డి.ఇ కావలి ఎస్ వి సాయికుమార్ , డి.ఇ.సి.ఎం సి. భాస్కర్, డి.ఇ ప్లానింగ్ కె.రమేశ్, ఉదయగిరి టెలికాం అడ్వైజరీ కమిటీ సభ్యురాలు తాటికొండ అనూష ఎమ్మెల్యే కి తెలియజేశారు.ఈ 21 టవర్‌ల నిర్మాణానికి అవసరమైన భూమి కేటాయింపు సర్టిఫికేట్‌లు మరియు సంబంధిత రెవెన్యూ శాఖ అధికారుల ఆమోదాలు త్వరగా అందించేలా సహకరించాలని వారు ఎమ్మెల్యే ని కోరారు.అందుకు ప్రతిస్పందించిన ఎమ్మెల్యే కాకర్ల సురేష్, ఇంకా సిగ్నల్ సమస్యలు కొనసాగుతున్న సుమారు 20 గ్రామాలకు అదనంగా కొత్త టవర్‌లు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉన్నట్లు ప్రతిపాదనలు వచ్చినట్టు తెలిపారు.ఈ విషయాన్ని ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి, టవర్‌ల కోసం అవసరమైన అనుమతులు త్వరితగతిన వచ్చేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.అదేకాలంలో, బి ఎస్ ఎన్ ఎల్ కి అవసరమైన భూమి మంజూరు సర్టిఫికేట్‌లు వెంటనే జారీ చేయాలని సంబంధిత రెవెన్యూ అధికారులకు స్పష్టమైన నిర్దేశాలు చేశారు. ఉదయగిరి ప్రజలకు మెరుగైన మొబైల్ కనెక్టివిటీ అందించడమే ఈ సమావేశము యొక్క ప్రధాన ఉద్దేశమని చెప్పారు.ఈ సమావేశంలో అన్ని మండలాల ఎమ్మార్వోలు, అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొని అభిప్రాయాలు వ్యక్తం చేశారు

  • Related Posts

    జిర్రవారపాలెం లో టీడీపీ పార్టీ కార్యకర్త గోసాల మల్లికార్జున మృతి,ఆయన కుటుంబ సభ్యలును పరమర్శించిన బిజ్జం వెంకట కృష్ణారెడ్డి.

    గోసాల మల్లికార్జున కుటుంబ సభ్యుల ను పరామర్శించిన కలిగిరి తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు బిజ్జం వెంకట కృష్ణరెడ్డి. కలిగిరి,మనధ్యాసన్యూస్, డిసెంబర్ 7, (కె నాగరాజు). ఉదయగిరి నియోజకవర్గం లోని కలిగిరి మండలం కలిగిరి గ్రామపంచాయతీ నందు జిరావారిపాలెం గ్రామానికి చెందిన గోసాల…

    ఫిజియోథెరపీ విద్య కావలి కే గర్వకారణంతొలి గ్రాడ్యుయేషన్ లో ప్రశంసలు..

    కావలి,మనధ్యాసన్యూస్,డిసెంబర్ 06,(కె నాగరాజు) అన్నిరకాల విద్యలు ఉన్న కావలిలో తొలి సారిగా ఫిజియోథెరపీ విద్యను ప్రవేశపెట్టి విజయవంతం నిర్వహిస్తున్న డాక్టర్ మాధవరెడ్డి అభినందనీయులు అని యమ్ యల్ ఎ డి.వి.క్రిష్ణారెడ్డి,ఆర్ డి ఒ వంశీకృష్ణ అభినందించారు. శ్రీ లక్ష్మి ఫిజియోథెరపీ ఇన్స్టిట్యూట్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    జిర్రవారపాలెం లో టీడీపీ పార్టీ కార్యకర్త గోసాల మల్లికార్జున మృతి,ఆయన కుటుంబ సభ్యలును పరమర్శించిన బిజ్జం వెంకట కృష్ణారెడ్డి.

    జిర్రవారపాలెం లో టీడీపీ పార్టీ కార్యకర్త గోసాల మల్లికార్జున మృతి,ఆయన కుటుంబ సభ్యలును పరమర్శించిన బిజ్జం వెంకట కృష్ణారెడ్డి.

    శ్రీ గౌరీ శంకర్ మహోత్సవాలలో పాల్గొన్న వైసీపీ నాయకులు మురళి రాజు

    శ్రీ గౌరీ శంకర్ మహోత్సవాలలో పాల్గొన్న వైసీపీ నాయకులు మురళి రాజు

    పెద్దిపాలెంలో అగ్ని ప్రమాద బాధితులను పరామర్శించిన జనసేన నేత బార్లపూడి క్రాంతి

    పెద్దిపాలెంలో అగ్ని ప్రమాద బాధితులను పరామర్శించిన జనసేన నేత బార్లపూడి క్రాంతి

    24,50,339 రూపాయల సిఎంఆర్ఎఫ్ చెక్కులు అందచేసిన:ఎమ్మెల్యే

    24,50,339 రూపాయల సిఎంఆర్ఎఫ్ చెక్కులు అందచేసిన:ఎమ్మెల్యే

    తవణంపల్లి మండలంలో 17 ఏళ్ల యువకుడు అదృశ్యం కేసు నమోదు

    తవణంపల్లి మండలంలో 17 ఏళ్ల యువకుడు అదృశ్యం కేసు నమోదు

    కొత్తగా వచ్చిన ఉపాధ్యాయులకు పి.ఆర్‌.టి.యు సముచిత స్థానం

    కొత్తగా వచ్చిన ఉపాధ్యాయులకు పి.ఆర్‌.టి.యు సముచిత స్థానం