మన ధ్యాస, నిజాంసాగర్ (జుక్కల్):స్థానిక సంస్థల ఎన్నికల వేళ రాజకీయ దిశా మార్పులు వేగం పెంచుకున్నాయి.పలువురు నాయకులు ప్రజల అభిప్రాయాలను అనుసరించి పార్టీలను మార్చుకుంటున్నారు. ఈ క్రమంలో జుక్కల్ మండలంలోని మాజీ ఎమ్మెల్యే హన్మంత్ షిండే స్వగ్రామమైన డోంగాం గ్రామంలో బీఆర్ఎస్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది.
కాంగ్రెస్ సీనియర్ నాయకుడు సంతోష్ అప్ప ఆధ్వర్యంలో గ్రామానికి చెందిన పలువురు బీఆర్ఎస్ నేతలు,కార్యకర్తలు తమ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరారు.జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు క్యాంప్ కార్యాలయంలో కొత్తగా చేరిన నాయకులకు కాంగ్రెస్ కండువా కప్పి స్వాగతం పలికారు.
ఎమ్మెల్యే మాట్లాడుతూ..
కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం ప్రవేశపెడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు,సంక్షేమ పథకాల ప్రభావంతో ఇతర పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు కాంగ్రెస్ వైపు ఆకర్షితులవుతున్నారు. పార్టీలో చేరిన ప్రతి ఒక్కరికీ సరైన గౌరవం,సముచిత స్థానం కల్పిస్తాం అని అన్నారు.ఈ కార్యక్రమంలో నాయకులు తదితరులు ఉన్నారు









