బంగారు పాళ్యం, మన ధ్యాస, నవంబర్23

తగ్గువారిపల్లె వైయస్సార్సీపి నేతలు ముబారక్, జగదీష్ ఆధ్వర్యంలో, ప్రభుత్వ వైద్య కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని చేపట్టారు.కోటి సంతకాల సేకరణ ముఖ్య ఉద్దేశాన్ని ప్రజలకు అర్థమయ్యే రీతిలో వారు వివరిస్తూ ప్రజల ఇష్టానుసారంగానే సంతకాలు సేకరణ చేపట్టారు.ఈ సందర్భంగా ముబారక్, జగదీష్ మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి పేద విద్యార్ధులు వైద్య విద్య అభ్యసించాలన్నా ఉద్దేశ్యంతో రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 17 మెడికల్ కాలేజీలను తీసుకొచ్చి అందులో 7 మెడికల్ కాలేజీల నిర్మాణాన్ని పూర్తిచేసి 5 కళాశాలలో తరగతులు ప్రారంభించడం జరిగిందన్నారు. పేదలకు వైద్యం అందించాలని ఉద్దేశంతో మాజీ ముఖ్యమంత్రి జగన్‌మోహన్ రెడ్డి వైద్య కళాశాలలను ఏర్పాటు చేస్తే, అసంపూర్తిగా ఉన్న కళాశాలల నిర్మాణానికి నిధులు విడుదల చేయకుండా కుట్రపూరితంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పిపిపి పేరిట ప్రైవేటీకరణ చేయడం తగదన్నారు.ప్రజాభీష్టం మేరకు చంద్రబాబు నాయుడు ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో తగువారి పల్లె వైఎస్ఆర్సిపి కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *