మన ధ్యాస, నిజాంసాగర్ (జుక్కల్) : ఉన్నత లక్ష్యాలతో మహిళల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని అమలులో ఉన్న ఇందిరా మహిళా శక్తి కార్యక్రమం భాగంగా ఉమ్మడి నిజాంసాగర్ మండలంలోని మాగి, తుంకిపల్లి గ్రామాల్లో డ్వాక్రా మహిళా సంఘాల సభ్యులకు పిట్లం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ చికోటి మనోజ్ కుమార్,మండల అధ్యక్షులు రవీందర్ రెడ్డి, ఐకెపి ఎపిఎం ప్రసన్నారాణి కలిసి చీరలను అందజేశారు.ఈ సందర్భంగా మార్కెట్ కమిటీ చైర్మన్ మాట్లాడుతూ.. ప్రభుత్వం మహిళల ఆర్థిక, సామాజిక శక్తివంతానికి అనేక సంక్షేమ పథకాలతో ముందుకు సాగుతోందని తెలిపారు. మహిళలకు డ్వాక్రా సంఘాలలో మహిళలకు అన్ని రకాలల్లో మహిళలకు ప్రాధాన్యత కల్పిస్తుందన్నారు.ఈ కార్యక్రమంలో నాయకులు గుర్రపు శ్రీనివాస్, వెంకటేశం, ఆకాష్,తదితరులు ఉన్నారు. గాలిపూర్ లో మండల యువజన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సంతోష్ రాథోడ్,గున్కల్
లో నాయకులు రమేష్ యాదవ్,ఐకెపి సిసి శ్రీకాంత్ లు చీరలు పంపిణీ చేశారు,మంగ్లూర్ గ్రామ అధ్యక్షులు చాకలి సాయిలు పంచాయతీ కార్యదర్శి రమ్యశ్రీ లు పంపిణీ చేశారు.
