తాటికొండ నవీన్ ఆధ్వర్యంలో రక్త నమూనా నిర్ధారణ పరీక్షలు..!!

కొండాపురం, నవంబర్ 18 మన ధ్యాస న్యూస్://

కొండాపురం మండలం లోని నేకునాంపేట జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాలలో (18-12-2022)మంగళవారం లైఫ్ లైన్ ఫౌండేషన్ మరియు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ సంయుక్తంగా కొండాపురం మండల రెడ్ క్రాస్ కన్వీనర్ తాటికొండ నవీన్ ఆధ్వర్యంలో 6 నుండి 10 తరగతుల విద్యార్థులకు “రక్త నమూనా నిర్ధారణ పరీక్షలు” నిర్వహించడం జరిగింది.ప్రధానోపాధ్యాయులు వెంకటరమణ మాట్లాడుతు ప్రతి వ్యక్తి తన రక్తవర్గం తెలుసుకొని ఉండటం తమ కనీస బాధ్యత అని, రక్త గ్రూపు లను తెలుసుకోవడమే కాకుండా ఆపదలో వున్నవారికి రక్తదానం చేసేందుకు అవకాశం ఉంటుందన్నారు. అంతేకాకుండా పాఠశాల యూ డైస్ లో స్టూడెంట్ మాడ్యూల్ నందు ప్రతి ఒక్కరి బ్లడ్ గ్రూప్ ను నమోదు చేయాలని తెలిపారు. లైఫ్ లైన్ ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు తాటికొండ నవీన్ మాట్లాడుతూ రక్త వర్గ నిర్ధారణ చేయించుకోవడం వల్ల ఆపదలో ఉన్నవారికి అత్యవసర సమయంలో సహాయం చేయవచ్చు అన్నారు. రక్తదానం ఆవశ్యకతని తెలుపుతూ రక్త నిర్ధారణ ఆవశ్యకతని తెలిపారు. రక్త వర్గ నిర్ధారణ పై విద్యార్థులకు అవగాహన కల్పించడంతో పాటు రక్త నిర్ధారణ నమూనా పరీక్షలు నిర్వహించారు. 100 మంది విద్యార్థులకు రక్త నమూనా పరీక్షలు నిర్వహించి రక్తం యొక్క గ్రూపు నిర్ధారణ చేయడం జరిగింది. అలాగే రక్త నమూనా నిర్ధారణ పరీక్ష మీద విద్యార్థులకు అవగాహన కల్పించడం జరిగింది.ఈ కార్యక్రమం లో సాయిపేట క్లస్టర్ ప్రధానోపాధ్యాయులు ఐ. రామమోహన్ రావు, కొండాపురం జడ్పీ హై స్కూల్ క్లస్టర్ ప్రధానోపాధ్యాయులు వి. రాధాకృష్ణ రెడ్ క్రాస్ ప్రతినిధులు పద్మ,వెంకటేష్ నేకునాంపేట హై స్కూల్ సిబ్బంది పాల్గొన్నారు.

  • Related Posts

    ఫిజియోథెరపీ విద్య కావలి కే గర్వకారణంతొలి గ్రాడ్యుయేషన్ లో ప్రశంసలు..

    కావలి,మనధ్యాసన్యూస్,డిసెంబర్ 06,(కె నాగరాజు) అన్నిరకాల విద్యలు ఉన్న కావలిలో తొలి సారిగా ఫిజియోథెరపీ విద్యను ప్రవేశపెట్టి విజయవంతం నిర్వహిస్తున్న డాక్టర్ మాధవరెడ్డి అభినందనీయులు అని యమ్ యల్ ఎ డి.వి.క్రిష్ణారెడ్డి,ఆర్ డి ఒ వంశీకృష్ణ అభినందించారు. శ్రీ లక్ష్మి ఫిజియోథెరపీ ఇన్స్టిట్యూట్…

    కలిగిరి ఆర్ అండ్ బి బంగ్లా నందు ఘనంగా నిర్వహించిన అంబేద్కర్ 69వ వర్ధంతి..

    కలిగిరి, మన ధ్యాస న్యూస్, డిసెంబర్ 06,(కె నాగరాజు). ఉదయగిరి నియోజకవర్గం కలిగిరి మండలంలోని ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ లో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 96వ వర్ధంతిని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఉదయగిరి నియోజకవర్గం ఇంచార్జ్ మేకపాటి…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    కొత్తగా వచ్చిన ఉపాధ్యాయులకు పి.ఆర్‌.టి.యు సముచిత స్థానం

    కొత్తగా వచ్చిన ఉపాధ్యాయులకు పి.ఆర్‌.టి.యు సముచిత స్థానం

    వందరోజుల కార్యక్రమం పర్యవేక్షించిన ఎం.పి.డి.ఒ. వీరేంద్ర

    వందరోజుల కార్యక్రమం పర్యవేక్షించిన ఎం.పి.డి.ఒ. వీరేంద్ర

    బాలకృష్ణ కుటుంబ సభ్యులను పరామర్శించిన కురుపాం ఎమ్మెల్యే తోయక జగదీశ్వరి

    బాలకృష్ణ కుటుంబ సభ్యులను పరామర్శించిన కురుపాం ఎమ్మెల్యే తోయక జగదీశ్వరి

    సంజోష్ తగరం హీరోగా పరిచయం అవుతున్న ‘మై లవ్’ చిత్రం ఘనంగా ప్రారంభం

    సంజోష్ తగరం హీరోగా పరిచయం అవుతున్న ‘మై లవ్’ చిత్రం ఘనంగా ప్రారంభం

    దారి ఇవ్వలేదని ఎస్టీ వ్యక్తిపై కుల దూషణ, దాడి: మాజీ సర్పంచ్‌ బోధపాటి గోవిందప్ప పై కేసు నమోదు చేయాలని బాధితుడి డిమాండ్

    దారి ఇవ్వలేదని ఎస్టీ వ్యక్తిపై కుల దూషణ, దాడి: మాజీ సర్పంచ్‌ బోధపాటి గోవిందప్ప పై కేసు నమోదు చేయాలని బాధితుడి డిమాండ్

    కామాలూరుకు ఆర్టీసీ బస్ సర్వీస్ ప్రారంభించిన ఎమ్మెల్యే మురళీమోహన్

    కామాలూరుకు ఆర్టీసీ బస్ సర్వీస్ ప్రారంభించిన ఎమ్మెల్యే మురళీమోహన్