కావలి కాలువకు సోమశిల జలాలను విడుదల చేసిన ఎమ్మెల్యే కాకర్ల సురేష్ , కావ్య కృష్ణారెడ్డి ..!

సంగం వద్ద సోమశిల జలాల విడుదల — రైతాంగంలో ఆనందం వెల్లువ..!,రెండవ కారు పంటకు నీటి అందుబాటు: సోమశిల నుంచి కావలి కాలువకు జలాలు..!

సంగం నవంబర్ 18 మన ధ్యాస న్యూస్://

సంగం వద్ద కావలి కాలువకు సోమశిల జలాలను విడుదల చేసి, రెండవ ఫేస్ లో రబ్బి పంటలకు నీటిని అందించేందుకు చేపట్టిన బృహత్తర కార్యక్రమంలో ఉదయగిరి శాసనసభ్యులు కాకర్ల సురేష్ , కావలి శాసనసభ్యులు దగ్గుమాటి వెంకట కృష్ణారెడ్డి మరియు సోమశిల ప్రాజెక్టు చైర్మన్ కేశవ చౌదరిలతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇద్దరు ప్రజాప్రతినిధులు జలవిడుదలను అధికారికంగా ప్రారంభించి, రైతాంగంలో ఆనందం వెల్లివిరిసెల చేశారు.ఈ సందర్భంగా మాట్లాడిన ఉదయగిరి శాసనసభ్యులు కాకర్ల సురేష్ , ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు , ఉప ముఖ్యమంత్రి శ్రీ కొణిదల పవన్ కళ్యాణ్ గారు, యువనేత మంత్రి నారా లోకేష్ బాబు కూటమి ప్రభుత్వం ఏర్పడిన నాటి నుండి రైతు సంక్షేమాన్ని అత్యంత ప్రాధాన్యంగా తీసుకుని నిరంతరం కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. రైతుల సమస్యలను అర్థం చేసుకుని వాటికి శాశ్వత పరిష్కారాలు చూపించేందుకు ప్రభుత్వం అహర్నిశలు శ్రమిస్తున్నారని తెలిపారు.కూటమి ప్రభుత్వం బాధ్యతలు చేపట్టిన తరువాత రాష్ట్రంలో వర్షాలు సమృద్ధిగా పడి అన్ని ప్రాజెక్టులు, చెరువులలో పుష్కలంగా నీరు నిండిపోయి నిండుకుండలను తలపిస్తున్నాయని పేర్కొన్నారు. ఈ పుష్కల వర్షాల వరదతో ఎన్నడూ లేని విధంగా రెండవ కారు పంటకు నీరు విడుదల చేయడం రైతులకు ఎంతో ఆశాజనకమని, ఇది వ్యవసాయ రంగానికి పునర్జీవం నింపే నిర్ణయమని తెలిపారు.అలాగే, రైతుల ఆర్థికాభివృద్ధి కోసం ప్రభుత్వం తీసుకుంటున్న సంక్షేమ నిర్ణయాలను కూడా ఆయన వివరించారు. రేపు రెండో విడతగా రాష్ట్ర ప్రభుత్వం ‘అన్నదాత సుఖీభవ’ పథకం ద్వారా ప్రతి రైతు ఖాతాలో 5,000 రూపాయలు జమ చేయనున్నదని, కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ పథకం ద్వారా అదనంగా 2,000 రూపాయలు రైతులకు చేరనున్నాయని పేర్కొన్నారు. ఈ రెండు పథకాల మద్దతుతో రైతుల భుజాలపై ఉన్న ఆర్థికభారం కొంతవరకు తగ్గి, పంట సాగు మరింత సులభమవుతుందని అన్నారు. అదేవిధంగా జల్ జీవన్ మిషన్ ద్వారా సోమశిల జలాలను ఉదయగిరి నియోజక వర్గంలోని ప్రతి ఒక్క ఇంటికి త్రాగునీటి అవసరాలు తీర్చేందుకు అందించే విధంగా కృషి చేస్తానని అన్నారు.ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, నాయకులు కార్యకర్తలు, రైతులు తదితరులు పాల్గొన్నారు.

  • Related Posts

    ఫిజియోథెరపీ విద్య కావలి కే గర్వకారణంతొలి గ్రాడ్యుయేషన్ లో ప్రశంసలు..

    కావలి,మనధ్యాసన్యూస్,డిసెంబర్ 06,(కె నాగరాజు) అన్నిరకాల విద్యలు ఉన్న కావలిలో తొలి సారిగా ఫిజియోథెరపీ విద్యను ప్రవేశపెట్టి విజయవంతం నిర్వహిస్తున్న డాక్టర్ మాధవరెడ్డి అభినందనీయులు అని యమ్ యల్ ఎ డి.వి.క్రిష్ణారెడ్డి,ఆర్ డి ఒ వంశీకృష్ణ అభినందించారు. శ్రీ లక్ష్మి ఫిజియోథెరపీ ఇన్స్టిట్యూట్…

    కలిగిరి ఆర్ అండ్ బి బంగ్లా నందు ఘనంగా నిర్వహించిన అంబేద్కర్ 69వ వర్ధంతి..

    కలిగిరి, మన ధ్యాస న్యూస్, డిసెంబర్ 06,(కె నాగరాజు). ఉదయగిరి నియోజకవర్గం కలిగిరి మండలంలోని ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ లో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 96వ వర్ధంతిని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఉదయగిరి నియోజకవర్గం ఇంచార్జ్ మేకపాటి…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    కొత్తగా వచ్చిన ఉపాధ్యాయులకు పి.ఆర్‌.టి.యు సముచిత స్థానం

    కొత్తగా వచ్చిన ఉపాధ్యాయులకు పి.ఆర్‌.టి.యు సముచిత స్థానం

    వందరోజుల కార్యక్రమం పర్యవేక్షించిన ఎం.పి.డి.ఒ. వీరేంద్ర

    వందరోజుల కార్యక్రమం పర్యవేక్షించిన ఎం.పి.డి.ఒ. వీరేంద్ర

    బాలకృష్ణ కుటుంబ సభ్యులను పరామర్శించిన కురుపాం ఎమ్మెల్యే తోయక జగదీశ్వరి

    బాలకృష్ణ కుటుంబ సభ్యులను పరామర్శించిన కురుపాం ఎమ్మెల్యే తోయక జగదీశ్వరి

    సంజోష్ తగరం హీరోగా పరిచయం అవుతున్న ‘మై లవ్’ చిత్రం ఘనంగా ప్రారంభం

    సంజోష్ తగరం హీరోగా పరిచయం అవుతున్న ‘మై లవ్’ చిత్రం ఘనంగా ప్రారంభం

    దారి ఇవ్వలేదని ఎస్టీ వ్యక్తిపై కుల దూషణ, దాడి: మాజీ సర్పంచ్‌ బోధపాటి గోవిందప్ప పై కేసు నమోదు చేయాలని బాధితుడి డిమాండ్

    దారి ఇవ్వలేదని ఎస్టీ వ్యక్తిపై కుల దూషణ, దాడి: మాజీ సర్పంచ్‌ బోధపాటి గోవిందప్ప పై కేసు నమోదు చేయాలని బాధితుడి డిమాండ్

    కామాలూరుకు ఆర్టీసీ బస్ సర్వీస్ ప్రారంభించిన ఎమ్మెల్యే మురళీమోహన్

    కామాలూరుకు ఆర్టీసీ బస్ సర్వీస్ ప్రారంభించిన ఎమ్మెల్యే మురళీమోహన్