
కొండాపురం, నవంబర్ 18 మన ధ్యాస న్యూస్://

కొండాపురం మండలం లోని నేకునాంపేట జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాలలో (18-12-2022)మంగళవారం లైఫ్ లైన్ ఫౌండేషన్ మరియు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ సంయుక్తంగా కొండాపురం మండల రెడ్ క్రాస్ కన్వీనర్ తాటికొండ నవీన్ ఆధ్వర్యంలో 6 నుండి 10 తరగతుల విద్యార్థులకు "రక్త నమూనా నిర్ధారణ పరీక్షలు'' నిర్వహించడం జరిగింది.ప్రధానోపాధ్యాయులు వెంకటరమణ మాట్లాడుతు ప్రతి వ్యక్తి తన రక్తవర్గం తెలుసుకొని ఉండటం తమ కనీస బాధ్యత అని, రక్త గ్రూపు లను తెలుసుకోవడమే కాకుండా ఆపదలో వున్నవారికి రక్తదానం చేసేందుకు అవకాశం ఉంటుందన్నారు. అంతేకాకుండా పాఠశాల యూ డైస్ లో స్టూడెంట్ మాడ్యూల్ నందు ప్రతి ఒక్కరి బ్లడ్ గ్రూప్ ను నమోదు చేయాలని తెలిపారు. లైఫ్ లైన్ ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు తాటికొండ నవీన్ మాట్లాడుతూ రక్త వర్గ నిర్ధారణ చేయించుకోవడం వల్ల ఆపదలో ఉన్నవారికి అత్యవసర సమయంలో సహాయం చేయవచ్చు అన్నారు. రక్తదానం ఆవశ్యకతని తెలుపుతూ రక్త నిర్ధారణ ఆవశ్యకతని తెలిపారు. రక్త వర్గ నిర్ధారణ పై విద్యార్థులకు అవగాహన కల్పించడంతో పాటు రక్త నిర్ధారణ నమూనా పరీక్షలు నిర్వహించారు. 100 మంది విద్యార్థులకు రక్త నమూనా పరీక్షలు నిర్వహించి రక్తం యొక్క గ్రూపు నిర్ధారణ చేయడం జరిగింది. అలాగే రక్త నమూనా నిర్ధారణ పరీక్ష మీద విద్యార్థులకు అవగాహన కల్పించడం జరిగింది.ఈ కార్యక్రమం లో సాయిపేట క్లస్టర్ ప్రధానోపాధ్యాయులు ఐ. రామమోహన్ రావు, కొండాపురం జడ్పీ హై స్కూల్ క్లస్టర్ ప్రధానోపాధ్యాయులు వి. రాధాకృష్ణ రెడ్ క్రాస్ ప్రతినిధులు పద్మ,వెంకటేష్ నేకునాంపేట హై స్కూల్ సిబ్బంది పాల్గొన్నారు.
