చిత్తూరులో ఘనంగా ఏపీడబ్ల్యూజేఎఫ్ 19వ ఆవిర్భావ దినోత్సవం.*

జర్నలిస్టుల సంక్షేమం, హక్కుల సాధనకు ఏపీడబ్ల్యూజేఎఫ్ రాజీలేని పోరాటాలు చేస్తోంది.

చిత్తూరు, మనధ్యాస, నవంబర్ 5.

ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ ( ఏపీడబ్ల్యూజేఎఫ్ ) 19 వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను బుధవారం ఉదయం స్థానిక ఎమ్మెస్సార్ మున్సిపల్ కాంప్లెక్స్ లోని జిల్లా యూనియన్ కార్యాలయంలో నిర్వహించారు. ఈ క్రమంలో యూనియన్ జెండాను ఏపీడబ్ల్యూజేఎఫ్ జిల్లా గౌరవాధ్యక్షులు సాటి గంగాధరం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా యూనియన్ రాష్ట్ర నాయకులు కవరకుంట్ల జయరాజ్ మాట్లాడుతూ… ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జర్నలిస్టుల సంక్షేమం, హక్కుల సాధనకు ఏపీడబ్ల్యూజేఎఫ్ రాజీలేని పోరాటాలు చేస్తోందని తెలిపారు. ” సేవ్ జర్నలిజం – ప్రొటెక్ట్ జర్నలిస్ట్ ” అనే నినాదంతో జర్నలిస్టుల పక్షాన పత్రికా స్వేచ్ఛ కోసం సంఘం అలుపెరగని కృషి చేస్తోందన్నారు. ఆల్ ఇండియా జర్నలిస్ట్ అలియన్స్ కు అనుబంధంగా దేశస్థాయిలో ఎపిడబ్ల్యూజేఎఫ్ కు ప్రత్యేక స్థానం ఉందన్నారు. చిత్తూరు జిల్లాలో ఎన్నడూ లేని విధంగా ఫెడరేషన్ సభ్యులందరికీ చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ ఆర్థిక సహకారంతో జర్నలిస్ట్ హెల్త్ కార్డులను జారీ చేయడం జరిగిందన్నారు. జర్నలిస్టుల సమస్యలపై ఎప్పటికప్పుడు స్పందించే ఏకైక సంఘం ఏపీడబ్ల్యూజేఎఫ్ అని స్పష్టం చేశారు. జిల్లా అధ్యక్షులు బి ప్రకాష్ మాట్లాడుతూ రానున్న రోజుల్లో యూనియన్ రాష్ట్ర నాయకత్వం ఆధ్వర్యంలో, వారి సహాయ, సహకారంతో అర్హులైన జర్నలిస్టులందరికీ ప్రభుత్వం జారీ చేసే అక్రిడిటేషన్లు, 3 సెంట్లు చొప్పున ఇళ్ల స్థలాలను మంజూరు చేయిస్తామని హామీ ఇచ్చారు. ఏపీడబ్ల్యూజేఎఫ్ చిత్తూరు నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి బాలసుబ్రమణ్యం మాట్లాడుతూ… కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు అమలు చేస్తున్న భద్రత చట్టాలను ప్రభుత్వానికి, ప్రజలకు వారధిగా పనిచేస్తున్న జర్నలిస్టులందరికీ వర్తింపజేయాలని డిమాండ్ చేశారు. అనంతరం మధ్యాహ్నం చిత్తూరు నగర పరిధిలోని కట్టుకాలువ వీధిలో మెప్మా, సపోర్ట్ సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న నిరాశ్రయుల వసతి గృహంలోని నిరాశ్రయులకు అన్నదానం చేశారు. కాగా ఈ కార్యక్రమంలో ఏపీ బ్రాడ్ కాస్టింగ్ జర్నలిస్ట్ అసోసియేషన్ ఎలక్ట్రానిక్ మీడియా ( ఏపీ బి జె ఏ ) – ఎలక్ట్రానిక్ మీడియా జిల్లా అధ్యక్షులు వి. జయచంద్ర, ఏపీడబ్ల్యూజేఎఫ్ జిల్లా కోశాధికారి పట్నం కృపానందరెడ్డి, ప్రచార కార్యదర్శి ఎస్జే దినేష్ కుమార్, సంయుక్త కార్యదర్శులు యాదవేంద్రరెడ్డి, గందోడి హరిప్రసాద్, చిత్తూరు నియోజకవర్గ కోశాధికారి ఎం నాగరాజు, ఉపాధ్యక్షులు వి. మురళీకృష్ణ, సంయుక్త కార్యదర్శులు విజయకుమార్, ఉదయ్, సురేంద్రరెడ్డి, కుబేంద్రన్, యూనియన్ సభ్యులు ఎన్ మురళి, మంజునాధ్, చిట్టిబాబు తదితరులు పాల్గొన్నారు.

  • Related Posts

    ఫిజియోథెరపీ విద్య కావలి కే గర్వకారణంతొలి గ్రాడ్యుయేషన్ లో ప్రశంసలు..

    కావలి,మనధ్యాసన్యూస్,డిసెంబర్ 06,(కె నాగరాజు) అన్నిరకాల విద్యలు ఉన్న కావలిలో తొలి సారిగా ఫిజియోథెరపీ విద్యను ప్రవేశపెట్టి విజయవంతం నిర్వహిస్తున్న డాక్టర్ మాధవరెడ్డి అభినందనీయులు అని యమ్ యల్ ఎ డి.వి.క్రిష్ణారెడ్డి,ఆర్ డి ఒ వంశీకృష్ణ అభినందించారు. శ్రీ లక్ష్మి ఫిజియోథెరపీ ఇన్స్టిట్యూట్…

    కలిగిరి ఆర్ అండ్ బి బంగ్లా నందు ఘనంగా నిర్వహించిన అంబేద్కర్ 69వ వర్ధంతి..

    కలిగిరి, మన ధ్యాస న్యూస్, డిసెంబర్ 06,(కె నాగరాజు). ఉదయగిరి నియోజకవర్గం కలిగిరి మండలంలోని ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ లో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 96వ వర్ధంతిని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఉదయగిరి నియోజకవర్గం ఇంచార్జ్ మేకపాటి…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    శ్రీ గౌరీ శంకర్ మహోత్సవాలలో పాల్గొన్న వైసీపీ నాయకులు మురళి రాజు

    శ్రీ గౌరీ శంకర్ మహోత్సవాలలో పాల్గొన్న వైసీపీ నాయకులు మురళి రాజు

    పెద్దిపాలెంలో అగ్ని ప్రమాద బాధితులను పరామర్శించిన జనసేన నేత బార్లపూడి క్రాంతి

    పెద్దిపాలెంలో అగ్ని ప్రమాద బాధితులను పరామర్శించిన జనసేన నేత బార్లపూడి క్రాంతి

    24,50,339 రూపాయల సిఎంఆర్ఎఫ్ చెక్కులు అందచేసిన:ఎమ్మెల్యే

    24,50,339 రూపాయల సిఎంఆర్ఎఫ్ చెక్కులు అందచేసిన:ఎమ్మెల్యే

    తవణంపల్లి మండలంలో 17 ఏళ్ల యువకుడు అదృశ్యం కేసు నమోదు

    తవణంపల్లి మండలంలో 17 ఏళ్ల యువకుడు అదృశ్యం కేసు నమోదు

    కొత్తగా వచ్చిన ఉపాధ్యాయులకు పి.ఆర్‌.టి.యు సముచిత స్థానం

    కొత్తగా వచ్చిన ఉపాధ్యాయులకు పి.ఆర్‌.టి.యు సముచిత స్థానం

    వందరోజుల కార్యక్రమం పర్యవేక్షించిన ఎం.పి.డి.ఒ. వీరేంద్ర

    వందరోజుల కార్యక్రమం పర్యవేక్షించిన ఎం.పి.డి.ఒ. వీరేంద్ర