

మన న్యూస్: అన్నమయ్య జిల్లా కలికిరి
ఈరోజు ఉదయం కలికిరి శ్రీనివాస జూనియర్ కాలేజ్ లో విద్యార్థి విభాగం నాయకుడు మలతోటి నరేష్ ఆధ్వర్యంలో ప్రపంచ మేధావి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారి 68 వ వర్ధంతి ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా మాట్లాడుతూ పీడితజనభాంధవుడు మహిళళకు సాధికారత, శూద్రులకు రాజ్యాధికారం,ప్రసాధించిన ఘనుడు దళిత జనోద్ధారకుడు అహర్నిశలు ఈదేశభవిష్యత్తుకై కృషిసల్పి ఈదేశ ప్రజలమాన ప్రాణాలకు అవమానకరంగా నిలిచిన మనువాదాన్ని తగలబెట్టి భారత ప్రజలందరికి స్వేచ్ఛ సమానత్వం ప్రసాదించిన మహోన్నత వ్యక్తి, దార్శనికుడు జాతీయనాయకుడు భారతరాజ్యాంగ నిర్మాత రిజర్వుబ్యాంక్ స్థాపనకు మార్గదర్శి లౌఖిక రాజ్యాంగం ద్వారా హిందూ మస్లిం క్రైస్తవ తదితర మతాలస్వేచ్ఛను కాపాడిన వ్యక్తి ఆదునిక భారతజాతిపిత డా”బాబాసాహేబ్ అంబేద్కర్ గారి వర్థంతి నేడు ఆయనకు నివాళులు అర్పిస్తున్నాను ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ ఖదీర్ భాష, అధ్యాపకులు ప్రభాకర్, ప్రసాద్, విద్యార్థులు తదితరు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.