కూటమి ప్రభుత్వం వైద్య విద్య రంగాన్ని పేదలకు చేస్తున్నారు అంటూ,,సీతారామపురంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోటి సంతకాలు సేకరణ…!!

సీతారామపురం, అక్టోబర్ :26 (మన ద్యాస న్యూస్)://

ప్రభుత్వ వైద్య విద్య రంగాన్ని కూటమి ప్రభుత్వం పేదలకు దూరం చేయడాన్ని వ్యతిరేకిస్తూ వైసిపి ఆధ్వర్యంలో చేపట్టిన కోటి సంతకాల సేకరణ కార్యక్రమం ఆదివారం సీతారామపురం లో నెల్లూరు జిల్లా వైఎస్ఆర్సిపి యూత్ వింగ్ జాయింట్ సెక్రెటరీ పాలగిరి ముద్దుకృష్ణమరాజు నిర్వహించారు. ఉదయగిరి నియోజకవర్గ వైఎస్ఆర్సిపి సమన్వయకర్త మేకపాటి రాజగోపాల్ రెడ్డి ఆదేశాల ప్రకారం సీతారామపురం మండల వైఎస్ఆర్సిపి కన్వీనర్ చింతం రెడ్డి సుబ్బారెడ్డి సూచనల మేరకు సీతారామపురం పంచాయతీ పరిధిలోని రాజు గారి వీధి, బీసీ కాలనీ, నారాయణమ్మ పేట ప్రాంతాలలో ఇంటింటికి తిరిగి కూటమి ప్రభుత్వం ప్రభుత్వ మెడికల్ కాలేజీ లను పిపిపి విధానం లోకి రావడం వలన పేద మధ్య తరగతి కుటుంబాలకు కలిగే నష్టాలను వివరిస్తూ కూటమి పాలన పేద ప్రజలను చేస్తున్న మోసాలను ప్రజలకు తెలియజేస్తూ సంతకాల సేకరణను పాలగిరి ముద్దుకృష్ణమరాజు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేద కుటుంబాలకు వైద్య విద్యను దూరం చేసి తమ జేబులు నింపుకోవాలనే కుట్ర కోణంతో కూటమి ప్రభుత్వం పిపిపి విధానాన్ని ప్రవేశపెట్టిందని దీనిని రాష్ట్ర ప్రజలందరూ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారన్నారు. ఎన్నికల సమయాలలో ప్రైవేటీకరణను వ్యతిరేకిచ్చిన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రతి ప్రభుత్వ ఆస్తిని ప్రైవేట్ వ్యక్తులకు అప్పచెప్పుతూ ప్రైవేటు యాజమాన్యాలకు తొత్తులుగా వ్యవహరిస్తూ రాష్ట్ర ప్రజలను మోసం చేస్తుందన్నారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీలకు అనుసంధానంగా ఉండే ఆసుపత్రులలో ఉచిత వైద్యాన్ని సైతం పేద ప్రజలకు దూరం చేసి పేద ప్రజల ఉసురు పోసుకుంటుందన్నారు. కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన పిపిపి విధానాన్ని కూటమి సానుభూతిపరులే వ్యతిరేకిస్తున్నారని మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి తలపెట్టిన కోటి సంతకాల సేకరణకు మద్దతు తెలుపుతున్నారన్నారు. పార్టీలకతీతంగా పిపిపి విధానాన్ని ప్రతి ఒక్కరూ వ్యతిరేకించి కోటి సంతకాల ఉద్యమంలో భాగస్వాములవాలని ఆయన కోరారు. కూటమి పాలన ఏర్పడిన ఒకటిన్నర సంవత్సరంలోనే ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత, మూటగట్టుకుందన్నారు. ఈ కార్యక్రమంలో వైసిపి నాయకులు కటారి శ్రీనివాసులు, ఏనుగుల రూపేష్, గుండుపల్లి శ్రీను, తిరుపతయ్య, పవన్ కుమార్, నారాయణరాజు, నవీన్, షబ్బీర్, జమీర్ సునీల్, సురేష్, అలీ తదితరులు పాల్గొన్నారు.

  • Related Posts

    సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ.. మండల అధ్యక్షులు ఎలే మల్లికార్జున్

    మన ధ్యాస,నిజాంసాగర్,( జుక్కల్ ) నిజాంసాగర్ మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో వడ్డేపల్లి,మల్లూర్,సుల్తాన్ నగర్,వెల్గనూర్ గ్రామాలకు చెందిన అర్హులైన లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను నిజాంసాగర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఏలే మల్లికార్జున్ అందజేశారు.ఈ సందర్భంగా మండల…

    భారీ వర్షంలోనూ క్షేత్ర స్థాయిలో విస్తృతంగా పర్యటనలు చేసిన ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్..!

    🔸మొంథ తుఫాన్ నేపథ్యంలో ప్రజలను అప్రమత్తంగా ఉండాలని సూచించిన ఎమ్మెల్యే కాకర్ల..!నియోజకవర్గ పరిధిలోని 8 మండలాల అధికారులు, కూటమి శ్రేణులకు తగు ఆదేశాలు..!పలుచోట్ల వరద బాధితులకు దుప్పట్లు, ఆహార పదార్దాలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే కాకర్ల..! ఉదయగిరి అక్టోబర్ 28 :(మన…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ.. మండల అధ్యక్షులు ఎలే మల్లికార్జున్

    • By RAHEEM
    • October 28, 2025
    • 5 views
    సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ.. మండల అధ్యక్షులు ఎలే మల్లికార్జున్

    ఆరోగ్యవంతమైన సమాజం కోసం పౌష్టికాహారం తప్పనిసరి.. — జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మి కాంతారావు

    • By RAHEEM
    • October 28, 2025
    • 5 views
    ఆరోగ్యవంతమైన సమాజం కోసం పౌష్టికాహారం తప్పనిసరి.. — జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మి కాంతారావు

    భారీ వర్షంలోనూ క్షేత్ర స్థాయిలో విస్తృతంగా పర్యటనలు చేసిన ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్..!

    భారీ వర్షంలోనూ క్షేత్ర స్థాయిలో విస్తృతంగా పర్యటనలు చేసిన ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్..!

    ప్రజలు కోసం ఎప్పుడూ ముందుండే ఎమ్మెల్యే కాకర్ల– మొంథా తుఫాన్ బాధితులకు కాకర్ల సురేష్ సహాయహస్తం..!!!

    ప్రజలు కోసం ఎప్పుడూ ముందుండే ఎమ్మెల్యే కాకర్ల– మొంథా తుఫాన్ బాధితులకు కాకర్ల సురేష్ సహాయహస్తం..!!!

    రెడ్డి కమ్యూనిటీ డెవలప్మెంట్ సొసైటీ చిత్తూరు జిల్లా అధ్యక్షులు గా పాటురు కమలాపతి రెడ్డి, ప్రచార కమీటీ అధ్యక్షులు గా నక్కల ప్రతాప్ రెడ్డి నియామకం

    రెడ్డి కమ్యూనిటీ డెవలప్మెంట్ సొసైటీ చిత్తూరు జిల్లా అధ్యక్షులు గా పాటురు కమలాపతి రెడ్డి, ప్రచార కమీటీ అధ్యక్షులు గా నక్కల ప్రతాప్ రెడ్డి నియామకం

    ఉదయగిరి లో రోడ్ల పక్కనే పేరుకుపోయిన చెత్త, చదారాలు,,? దోమల వలన ప్రజలు విష జ్వరాల బారిన పడుతున్న వైనం..?చర్యలు తీసుకోవాలంటూ ప్రజలు వేడుకలు…?

    ఉదయగిరి లో రోడ్ల పక్కనే పేరుకుపోయిన చెత్త, చదారాలు,,? దోమల వలన ప్రజలు విష జ్వరాల బారిన పడుతున్న వైనం..?చర్యలు తీసుకోవాలంటూ ప్రజలు వేడుకలు…?