మన ధ్యాస,నిజాంసాగర్, అక్టోబర్ 24 ( జుక్కల్ ):
నిజాంసాగర్ మండలంలోని మాగి జిఎస్ఆర్ చక్కెర ఫ్యాక్టరీలో శుక్రవారం బాయిలర్ పూజను ఘనంగా నిర్వహించారు.ఫ్యాక్టరీలో క్రషింగ్ విజయవంతం కావాలని,సీజన్‌లో ఎలాంటి ఆటంకాలు లేకుండా ఉత్పత్తి సాఫీగా సాగాలని ఆకాంక్షిస్తూ బాయిలర్ వద్ద పూజారి మంత్రోచ్చారణల మధ్య ఫ్యాక్టరీ ప్రెసిడెంట్ శంకర్‌రావు,వైస్ ప్రెసిడెంట్ వేణుగోపాల్‌రావు,చీఫ్ జనరల్ మేనేజర్ మాలకొండయ్య,కెన్ జనరల్ మేనేజర్ వెంగల్‌రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ –ప్రతి సంవత్సరం బాయిలర్ పూజను శ్రద్ధాభక్తులతో నిర్వహించడం మాకు ఆనవాయితీ.రైతులు చక్కెర సమయానికి సరఫరా చేస్తే,ఫ్యాక్టరీ కార్యకలాపాలు సాఫీగా సాగుతాయి.ఈ సీజన్‌లో ఉత్పత్తి లక్ష్యాలను అధిగమించేలా అందరూ కృషి చేయాలి కోరారు.ఈ కార్యక్రమంలోఇంజనీరింగ్ జనరల్ మేనేజర్‌లు రాజబాబు,శ్రీనాథ్‌రెడ్డి, ప్రాసెసింగ్ జనరల్ మేనేజర్ సుబ్బారెడ్డి, అకౌంట్స్ జనరల్ మేనేజర్ సుగుణభూషణ్‌రావు,తదితరులు ఉన్నారు.








