ఉదయగిరి అక్టోబర్ 24 :(మన ధ్యాస న్యూస్):///
కర్నూలు జిల్లాలో జరిగిన ఘోర బస్ ప్రమాదం ఉదయగిరి నియోజకవర్గం వాసులను విషాదంలో ముంచింది. వింజమూరు మండలం చాకలికొండ పంచాయతీకి చెందిన గోళ్ల రమేష్, గోళ్ల అనూష దంపతులు, వారి ఇద్దరు పిల్లలు మన్విష్, మన్విత్ ఈ ప్రమాదంలో దుర్మరణం చెందారు. ఈ విషాద ఘటనపై మాజీ ఎమ్మెల్యే బొల్లినేని వెంకట రామారావు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. “ఈ ఘటన నన్ను తీవ్రంగా కలిచివేసింది. ఒకే కుటుంబం నిండుగా నష్టపోవడం,హృదయవిదారకమైన విషయం,అని ఆయన అన్నారు. మృతుల కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.ప్రభుత్వం అన్ని విధాలుగా ఆ కుటుంబాన్ని ఆదుకుంటుంది. మా పార్టీ కూడా వారికి అండగా నిలుస్తుంది,” అని బొల్లినేని హామీ ఇచ్చారు.







