వాగులో పడి గల్లంతైన మృతదేహం లభ్యం..! 6 గంటలపాటు తన సిబ్బందితో గాలింపు చర్యలు చేపట్టిన-ఎస్సై సయ్యద్ లతీ ఫున్నిసా..
జలదంకి, అక్టోబర్ 23 :(మన ధ్యాస న్యూస్): జలదంకి మండలం ఛామదల గ్రామానికి చెందిన దంపూరు మల్లికార్జున (45) చామదల గ్రామం నుండి బైక్ పై కావలి కి వెళ్లేందుకు తన బైక్ పై నేరెళ్ల వాగు దాటేందుకు కదలడంతో బైక్ అదుపు తప్పింది. దీంతో బైక్ తోపాటు.. మల్లికార్జున కూడ సప్తా పై నుండి వాగులో పడిపోయారు..**జలదంకి ఎస్సై సయ్యద్ లతీ ఫున్నిసా ఘటన స్థలానికి చేరుకుని తన సిబ్బందితో గాలింపు చర్యలు చేపట్టారు.. ఫలితం లేకపోవడంతో ఎస్ డి ఆర్ ఎఫ్ టీం ను రప్పించి వారి సహాయంతో పోలీస్ సిబ్బంది కలిసి మృతదేహాన్ని బయటకు తీశారు.. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కావలి ఏరియా వైద్యశాలకు తరలించారు..**కుటుంబ యజమాని మృతి చెందడంతో భార్య గోవిందమ్మ కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. వీరికి ఒక పాప ఉంది. భర్త సంపాదనతో ఇల్లు గడుస్తున్న తరుణంలో ఇలాంటి ఉపద్రవం వచ్చి పడిందని వారు రోదిస్తుండడం అక్కడ వారిని కలిసి వేసింది..









