ఉదయగిరి, అక్టోబర్ 23 :-మన ధ్యాస న్యూస్
ఉదయగిరి శాసనసభ్యులు కాకర్ల సురేష్ విజ్ఞప్తి మేరకు దుత్తలూరు మండలంలోని నర్రవాడ గ్రామంలో వెలసి ఉన్నటువంటి శ్రీ వెంగమాంబ తల్లి దేవస్థానం అభివృద్ధి కోసం రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి 10 కోట్ల రూపాయలతో ప్రతిపాదనలు తయారుచేసి మంజూరు చేస్తామని హామీ ఇవ్వడం పట్ల టిడిపి రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ, మాజీ జెడ్పీ చైర్మన్ పొన్నెబోయిన చంచల బాబు యాదవ్ హర్షం వ్యక్తం చేశారు. ఉదయగిరి పట్టణంలోని చెంచు రామయ్య నగర్ లో ఉన్నటువంటి చంచల బాబు యాదవ్ అతిథి గృహంలో విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో చంచల బాబు యాదవ్ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విశాఖకు గూగుల్ హబ్ తీసుకురావడం భారతదేశంలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక గుర్తింపు వచ్చిందని యువ నాయకులు నారా లోకేష్ బాబు కృషితో రాష్ట్రానికి లక్ష కోట్ల రూపాయల పెట్టుబడులు వస్తున్నాయని అన్నారు. పారిశ్రామికవేత్తల చూపు మొత్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వైపు ఉందని రాష్ట్రానికి రెండు లక్షల ఉద్యోగాలు వచ్చే అవకాశాలు ఉన్నాయని అన్నారు. శాసనసభ్యులు కాకర్ల సురేష్, నెల్లూరు పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కృషితో ఉదయగిరి నియోజకవర్గం అన్ని రంగాలలో అభివృద్ధి సాధిస్తుందని తెలిపారు. కార్యక్రమంలో మండల కన్వీనర్ బయన్న, బజ్జ నరసింహులు, నల్లిపోగు రాజా, అంకయ్య యాదవ్, రాజా యాదవ్, అంబటి మస్తాన్, కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.







