దుత్తలూరు అక్టోబర్ 18:(మన ధ్యాస న్యూస్ ప్రతినిధి నాగరాజు )://
పరిశుభ్రత పరిరక్షణ స్వర్ణాంధ స్వచ్ఛ ఆంధ్ర ప్రధాన లక్ష్యం అని తాసిల్దార్ నాగరాజు అన్నారు, స్థానిక తహశీల్దార్ కార్యాలయం వద్ద శనివారం స్వర్ణాంధ్ర స్వచ్ఛాoద్ర కార్యక్రమం తమ సిబ్బందితో కలిసి నిర్వహించారు,అనంతరం తహసీల్దార్ నాగరాజు మాట్లాడుతూ పరిశుభ్రతతో సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుందన్నారు,సంపూర్ణ ఆరోగ్యంతో సమాజాభివృద్ధి చెందుతుందన్నారు,పరిశుభ్రత పైన ప్రతి ఒక్కరూ అవగాహనను, పెంపొందించుకోవాలన్నారు,తాసిల్దార్ కార్యాలయం ఆవరణంలో శుభ్రత కార్యక్రమాన్ని నిర్వహించి పలు అంశాలను వివరించడం జరిగింది,ఈ కార్యక్రమంలో సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.







