

ఐరాల డిసెంబర్ 4 మన న్యూస్
పూతలపట్టు నియోజకవర్గం, ఐరాల మండలం, పొలకల రెడ్డివారిపల్లె గ్రామానికి చెందిన చింతమాకుల రజనీ పెద్దకర్మకు పూతలపట్టు శాసనసభ్యులు డాక్టర్ కలికిరి మురళీమోహన్ హాజరై ఆమె చిత్రపటానికి పూలమాల వేసి నివాళ్ళు అర్పించారు. దివంగత రజనీ పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని పార్ధిస్తూ, కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. ఈ కార్యక్రమంలో ఐరాల మండల పార్టీ అధ్యక్షుడు గిరిధర్ బాబు, మాజీ ఎంపీపీ దేవాజీ, పొలకల ఉప సర్పంచ్ సురేంద్ర నాయుడు, టిడిపి నాయకులు దాము, చంద్రబాబు, పి.మునిరత్నం తదితరులు పాల్గోన్నారు.