ఉదయగిరి అక్టోబర్ 9 :(మన ధ్యాస న్యూస్ ):///
ఉదయగిరి మండలం, వెంకట్రావుపల్లి గ్రామానికి చెందిన దుగ్గినబోయిన శ్రీనివాసులు – శ్రీమతి సుబ్బమ్మ గారి కుమార్తె శిరీష వివాహ మహోత్సవం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా, ఉదయగిరి శాసనసభ్యులు శ్రీ కాకర్ల సురేష్ గారు కాకర్ల చారిటబుల్ ట్రస్ట్ తరఫున నవ వధువును ఆశీర్వదిస్తూ, స్థానిక నాయకుల ద్వారా పెళ్ళికానుకగా 10 వేల రూపాయలను అందజేశారు.ఈ సందర్భంగా శ్రీ కాకర్ల సురేష్ గారు నూతన వధూవరులు ఆనందమయమైన దాంపత్య జీవితం గడపాలని, వారి జీవితాలు సుఖసంతోషాలతో నిండాలని ఆకాంక్షించారు. కాకర్ల చారిటబుల్ ట్రస్ట్ సమాజ సేవలో భాగంగా ఇలాంటి సేవా కార్యక్రమాలు నిరంతరం కొనసాగిస్తుందని తెలిపారు.ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకుడు గనుగపెంట ఓబుల్ రెడ్డి,గడ్డం శ్రీనివాసులు, సత్తెనపల్లి శ్రీరాములు,యువ నాయకులు తుమ్మల కిరణ్ తదితరులు పాల్గొన్నారు.







