మన ధ్యాస, నిజాంసాగర్ (జుక్కల్):నిన్న రాత్రి కురిసిన భారీ వర్షాల ప్రభావంతో నిజాంసాగర్ ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు చేరింది. ప్రాజెక్టులోకి 32,820 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో నమోదు కాగా, నీటిమట్టం పూర్తి స్థాయైన 1405.00 అడుగులకు చేరింది.దీంతో అధికారులు భద్రతా చర్యల భాగంగా ఐదు వరద గేట్లు ఎత్తి,అదే పరిమాణంలో నీటిని దిగువ మంజీరా నదిలోకి విడుదల చేస్తున్నట్లు
నీటిపారుదల శాఖ ఏఈ సాకేత్ తెలిపారు.ప్రస్తుతం ప్రాజెక్టులో 17.802 టీఎంసీల నీటి నిల్వ ఉందని,పైప్రాంతాల నుండి వచ్చే వరద ప్రవాహాన్ని గేట్ల ద్వారా నియంత్రితంగా విడుదల చేస్తున్నట్లు పేర్కొన్నారు.







