ఉదయగిరి, అక్టోబర్ 06: (మన ధ్యాస న్యూస్ ):///

ఉదయగిరి జడ్పీపీ హైస్కూల్ నందు 69 వ ఆంధ్రప్రదేశ్ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ కార్యక్రమాన్ని ఉదయగిరి ఎమ్ ఈ ఓ, టి వెంకటేశ్వర్లు, ఆధ్వర్యంలో,ఎస్ జీ ఎఫ్ సెక్రటరీ, డి వి వి. ప్రసాద్ సమన్వయంతో మండల స్థాయిలో హైస్కూల్ గ్రౌండ్, నందు పాఠశాల పిల్లలు అండర్14, అండర్ 17 లకు పోటీలు నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమమం లో ముఖ్య అతిథులుగా ఉదయగిరి ఎమ్మార్వో.ఎల్ మోహన్ రావు , హెచ్ ఎమ్ జి. శ్రీనివాసులు పాల్గొన్నారు. దీని యొక్క ప్రాముఖ్యతను వివరిస్తూ పాఠశాల పిల్లల్లో క్రీడలు ప్రోత్సహించడం, ద్వారా వారికి శారీరిక శ్రేయస్సు పెంపొందించడం, శిక్షణ శిబిరాలు నిర్వహించి విద్యార్థులను క్రీడా శిక్షణ స్కిల్స్ అభివృద్ధి పరచడం దీని యొక్క ముఖ్య ఉద్దేశమని, ప్రాంతీయంగా ప్రాచుర్యం పొందిన క్రీడలను ప్రోత్సహించడం, ప్రాచుర్యం,కల్పించడం వల్ల విద్యార్థుల శారీరక శ్రేయస్సు,క్రీడా కార్యక్రమాల సమన్వయం చేయడం, క్రీడామీట్, ట్రయిల్ మ్యాచ్, ద్వారా క్రీడల్లో పాఠశాల బాల బాలికల నాణ్యతను, క్రీడాకారుల్లో ఆరోగ్యం సామాజిక మరియు సాంస్కృతిక చైతన్యాన్ని పెంపొందించి నాణ్యమైన శారీరక విద్యను అందిస్తున్నామని తెలిపారు . షేక్. ఖాజారియాజ్ పీడీ .తాబితా మేడం,షేక్ నాయీమా టీచర్(పి ఈ టి ) తదితర టీచర్స్ ఉన్నారు.
