మన ధ్యాస,నిజాంసాగర్,( జుక్కల్ ) సెప్టెంబర్ 30, నిజాంసాగర్ మండలంలోని మల్లూరు,హసన్‌పల్లి,తదితర గ్రామాలల్లో సద్దుల బతుకమ్మ వేడుకలను ఎంతో ఉత్సాహంగా,ఆధ్యాత్మిక శ్రద్ధతో నిర్వహించారు.
ఈ సందర్భంగా సద్దుల బతుకమ్మలను రకరకాల పూలతో అందంగా అలంకరించి ప్రతి ఇంటింటి నుంచి చావిడి వద్దకు తీసుకువచ్చారు.అక్కడ అందరూ కలిసి బతుకమ్మ చుట్టూ వలయంగా తిరుగుతూ బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో అంటూ ఆడిపాడి నృత్యాలు చేశారు. గ్రామం అంతటా ఉత్సాహం, ఆనందం నిండిపోగా,పూల సువాసనలతో వాతావరణం మరింత కళకళలాడింది.
అనంతరం సాంప్రదాయంగా చెరువుల వద్దకు తీసుకెళ్లి బతుకమ్మలను నిమజ్జనం చేసి వేడుకలను ముగించారు.ఈ సందర్భంగా గ్రామ పెద్దలు,పెద్ద సంఖ్యలో మహిళలు, యువతులు పాల్గొని పండుగను విజయవంతంగా జరిపారు.

By RAHEEM

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *