మన ధ్యాస,నిజాంసాగర్,( జుక్కల్ ) ఉస్మానియా యూనివర్సిటీ ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన 84వ స్నాతకోత్సవంలో తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ చేతుల మీదుగా హిందీ విభాగంలో డాక్టరేట్ పట్టా అందుకున్న డాక్టర్ బాలాజీని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు ఘనంగా సన్మానించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు మాట్లాడుతూ – డాక్టర్ బాలాజీ చిన్ననాటి నుంచే కష్టపడి చదువుతూ,సాధనతో ఉన్నత శిఖరాలను అధిరోహించడం యావత్ జుక్కల్ నియోజకవర్గ ప్రజలకు గర్వకారణమని తెలిపారు.ఉస్మానియా వేదికగా గవర్నర్ చేతుల మీదుగా డాక్టరేట్ పట్టా స్వీకరించడం ఆయన ప్రతిభకు నిదర్శనమని కొనియాడారు.అలాగే,తన లక్ష్యాలను నెరవేర్చుకునే మార్గంలో భవిష్యత్తులో కూడా మా వంతు సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. విద్య,పరిశోధన రంగాల్లో మరింత ఉన్నత స్థానాలను చేరుకోవాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు రమేష్ దేశాయ్, రమేష్,సతీష్ పటేల్,ప్రసాద్,మోహన్,తదితరులు ఉన్నారు.
