
మన ధ్యాస ప్రతినిథి ఏలేశ్వరం దుర్గా శ్రీనివాస్:
ఏలేశ్వరం మండలం పేరవరం గ్రామంలో ఇటీవల విద్యుత్ షార్ట్ సర్క్యూట్తో వేమగిరి చినబాబు తాటాకీల్లు పూర్తిగా గృహపకరణ వస్తువులు కాలి బూడిదయ్యాయి. వేమగిరి చిన్నబాబు కుటుంబానికి తిరుమాలి మిరాకిల్ మినిస్ట్రీస్ అండ్ సోషల్ వెల్ఫేర్ అసోసియేషన్ అధినేత డాక్టర్ పి ప్రవీణ్ పాల్ 7వేల రూపాయలు విలువగల వంట పాత్రలు,పిల్లలకు స్కూల్ బ్యాగులు, నిత్యవసర వస్తువులు, బట్టలు, 2000 రూపాయలు నగదు ఆ కుటుంబానికి ఆర్థిక సహాయం చేశారు.ఈ సందర్భంగా ప్రవీణ్ పాల్ మాట్లాడుతూ విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తో తాటాకిల్లు పూర్తిగా దగ్ధమై సామాగ్రి అంతా బూడిదైపోవడం చాలా బాధాకరమైన విషయం అని, మిరాకిల్ మినిస్ట్రీస్ తరఫున వారికి ఆర్థిక సహాయం చేయడం జరిగిందని, ఇలాగే దాతలు ఎవరైనా ఉంటే ముందుకు వచ్చి వారికి సహాయం చేయవలసిందిగా కోరుతున్నామన్నారు.ఈ కార్యక్రమంలో వేమగిరి సత్యానందం,అబ్రహం,రాజబ్బాయ్, వేమగిరి బుచ్చిబాబు,జీవన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.









