- ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన పూతలపట్టు శాసనసభ్యులు మురళీమోహన్.
కాణిపాకం సెప్టెంబర్ 29 మన ద్యాస
స్వయంభు వరసిద్ధి వినాయక స్వామి ని మాజీ పార్లమెంట్ సభ్యులు గల్లా జయదేవ్ దర్శించుకున్నారు. సోమవారం ఉదయం కుటుంబ సభ్యులతో కలిసి కాణిపాకం ఆలయం వద్దకు చేరుకున్న మాజీ ఎంపీ గల్లా జయదేవ్ పూతలపట్టు శాసనసభ్యులు డాక్టర్ కలికిరి మురళీమోహన్ మరియు కాణిపాకం దేవస్థానం ఈవో పెంచల కిషోర్ ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. స్వామి వారి దర్శనంతరం వేద ఆశీర్వాద మండపంలో వేదపండితులు వేదమంత్రాల నడుమ ఆశీర్వాదాలు అందించగా, ఎమ్మెల్యే మురళీమోహన్ గల్లా జయదేవ్ ని స్వామివారి శేష వస్త్రంతో సత్కరించి, స్వామివారి చిత్రపటం, తీర్థప్రసాదాలను అందజేశారు. తరువాత ఆలయ మురళీమోహన్ కాణిపాకం ఆలయ చరిత్ర, ప్రత్యేకతలు, ఆలయంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు. ఈ కార్యక్రమంలో ఐరాల మండల అధ్యక్షులు గంగారపు హరిబాబు నాయుడు కాణిపాకం దేవస్ధానం చైర్మన్ మణినాయుడు, తవణంపల్లె మండల అధ్యక్షులు వెంకటేష్ చౌదరి, తవణంపల్లె మండల మాజీ అధ్యక్షులు గాలి దిలీప్ కుమార్, నాయకులు మధుసూదన్ రావు, హేమాద్రి నాయుడి, లోకనాధ్ నాయుడు, నరసింహాల నాయుడు మరియు మండల నాయకులు, కార్యకర్తలు పాల్గోన్నారు.








