

వివేకానంద సేవా సమితి ఆధ్వర్యంలో వృద్ధులకు భోజనాలు పంపిణీ
(మన న్యూస్ ప్రతినిధ) ఏలేశ్వరం: నగర పంచాయతీ మూడో వార్డు కౌన్సిలర్,వైసీపీ యువ నాయకుడు బదిరెడ్డి సతీష్ గోవింద్ బాబు జన్మదినం సందర్భంగా వివేకానంద సేవా సమితి అధ్యక్షులు మైరాల నాగేశ్వరరావు ఆధ్వర్యంలో అన్నదానం చేపట్టారు.ప్రత్తిపాడులో పాదాలమ్మ తల్లి ఆలయం వద్ద గల శారదా వయో వృద్ధాశ్రమంలో ఉన్న వృద్ధులకు సేవా సమితి సభ్యులు మైరాల నాగేశ్వరరావు,సారా శ్రీను చేతుల మీదుగా అన్నదానం చేశారు.ఈసందర్భంగా వృద్దులు సేవా సమితి సభ్యులకు కృతజ్ఞతలు తెలుపుతూ,ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న బదిరెడ్డి గోవింద్ ఉన్నత శిఖరాలను అధిరోహించి ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్లు జీవించాలని ఆశీర్వదించారు.