హైదరాబాద్, మన ధ్యాస,సెప్టెంబర్ 21:సమాచారం ఆధారంగా సోట్ పోలీసులు శనివారం మధ్యాహ్నం లింగంపల్లి సమీపంలోని ఇక్రిసాట్ ఓల్డ్ టోల్ ప్లాజా వద్ద తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో హోండా సిటీ కారును ఆపి తనిఖీ చేయగా, దానిలో అక్రమంగా తరలిస్తున్న గంజాయి బయటపడింది.పోలీసుల వివరాల ప్రకారం, మొత్తం 82 ప్యాకెట్లలో గంజాయి దాచిపెట్టినట్లు గుర్తించారు. స్వాధీనం చేసిన గంజాయి మొత్తం బరువు 166 కిలోలుగా ఉందని వెల్లడించారు. ఈ గంజాయిని పట్టుబడిన వ్యక్తులు ఎక్కడి నుండి తెచ్చారు, ఎక్కడికి తరలిస్తున్నారు అనే అంశంపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.సంబంధిత వ్యక్తులపై కేసు నమోదు చేసి విచారణ కొనసాగిస్తున్నట్లు అధికారులు తెలిపారు. మత్తు పదార్థాల అక్రమ రవాణాను అరికట్టేందుకు పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.