మన ధ్యాస,నిజాంసాగర్ ( జుక్కల్ ) నిజాంసాగర్ మండలంలోని అచ్చంపేట్ శివారులోని నాగమడుగు లోలెవల్ వంతెన వద్ద నిజాంసాగర్ గ్రామానికి చెందిన వడ్ల రవి,బ్రాహ్మణపల్లి గ్రామంలోని చెరువులో నీరుడి పోచయ్య వేర్వేరు ప్రమాదాల్లో నీట మునిగి గల్లంతైన విషయం తెలిసిందే వారి మృతదేహాల కోసం బాన్సువాడ,ఎల్లారెడ్డి, కామారెడ్డికి చెందిన అగ్నిమాపక శాఖ,ఎన్డీఆర్ఎఫ్ బృందం సభ్యులు గురువారం ఉదయం నుంచి గాలింపు చర్యలు చేపట్టారు.ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆయా స్థలాల్లో గాలింపు చర్యలు చేపట్టినప్పటికీ వారి మృతదేహాల జాడ కనిపించలేదు.దీంతో విషయం తెలుసుకున్న బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి గురువారం నాగమడుగులో లెవల్ వంతెన వద్ద,బ్రాహ్మణపల్లి గ్రామంలోని చెరువు వద్ద ఘటనా స్థలాలను పరిశీలించారు. అధైర్యపడొద్దని,ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని, ప్రభుత్వం ఎల్లప్పుడూ అండంగా ఉంటుందని వారి కుటుంబీకులకు ధైర్యం చెప్పారు.నాగమడుగు లోలెవల్ వంతెన వద్ద రెండు రోజుల్లో రెండు ప్రమాదాలు జరిగి ఇద్దరు వ్యక్తులు గల్లంతుకావడంతో ప్రమాదాలు ఎందుకు జరుగుతున్నాయని అధికారులను అడిగి వివరాలు సేకరించారు.అధికారులు ప్రజలకు అవగాహన కల్పించే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ఆమె వెంట తహసిల్దార్ బిక్షపతి,తదితరులు ఉన్నారు