మన ధ్యాస,నిజాంసాగర్ ( జుక్కల్ ) సింగూరు ప్రాజెక్టుకు వరద పోటెత్తుతోంది. వరద నీరు భారీగా వచ్చి చేరుతుంది. ప్రాజెక్టు ఎగువ ప్రాంతాల నుంచి వరద ప్రవాహం పెరుగుతుంది. సింగూరు ప్రాజెక్టును వర్షకాల సీజన్‌ ఆరంభంలో డ్యామ్‌ సెప్టీ అధికారులు పరిశీలించి, మరమ్మత్తులు చేపట్టాలని లేదంటే ప్రమాదం జరిగే అవకాశం ఉందని, ప్రాజెక్టులో 17 టీఎంసీల నీరు మించకుండా ఉంచాలని డ్యామ్‌ సెప్టీ అధికారులు హెచ్చరించారు.దీంతో ప్రాజెక్టులో 17 టీఎంసీలు మించకుండా ఉండేందుకు ప్రాజెక్టు అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ, జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ప్రాజెక్టు ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరద ప్రవాహానికి ప్రాజెక్టు నిండుకుండలా మారుతుండడంతో అధికారులు ప్రవాహానికి తగ్గకుండా ప్రాజెక్టు గేట్లను పైకెత్తి దిగువకు నీటిని వదులుతున్నారు. వరద ప్రవాహం పెరుగుతుండడంతో మంజీరా నది పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, జాలర్లు చేపల వేటకు వెళ్ళొద్దని ప్రాజెక్టు డిప్యూటీ ఈఈ నాగరాజ్‌ హెచ్చరించారు.
ఏడు గేట్లను పైకెత్తి దిగువకు నీరు ప్రాజెక్టులోకి వరద ప్రవాహం రోజు రోజుకు పెరుగుతుండడంతో ప్రాజెక్టు అధికారులు ప్రాజెక్టులోని ఏడు గేట్లను పైకెత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు.గత వారం రోజుల క్రితం ప్రాజెక్టులోని 3,8,9,10 నంబర్ల గేట్లను 1.50 మీటర్ల ఎత్తుతో, 4,5,14 నంబర్ల గేట్లను 2 మీటర్ల ఎత్తుతో మొత్తం ఏడు గేట్ల ద్వారా 56597 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. జేన్‌ కో కు 1780 క్యూసెక్కులు, సింగూరు ఎడమ కాలువ ద్వారా 120 క్యూ సెక్కులు, హైదరాబాద్‌ వాటర్‌ బోర్డుకు 80 క్యూసెక్కులు, మిషన్‌ భగీరథకు 70 క్యూసెక్కులు, 390 క్యూసెక్కులు అవిరి అవుతుండగా మొత్తం 59037 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతుండగా, ప్రాజెక్టులోకి 57237 క్యూసెక్కుల చేరుతుండగా, ప్రాజెక్టు సామర్థ్యం 29.917 టీఎంసీలు అయినప్పటికీ, ప్రస్తుతం ప్రాజెక్టులో 17.199 టీఎంసీల నీరు చేరుకుంది.
మూడేళ్ల క్రీతం రికార్డుకు బ్రేక్‌
సింగూరు ప్రాజెక్టు నుంచి దిగువకు నీటిని వదిలడంలో మూడేళ్ల క్రితం రికార్డును ఈ సీజన్‌లో బ్రేక్‌ చేసింది. 2022లో ప్రాజెక్టు నుంచి 101 టీఎంసీల నీటిని దిగువకు వదిలి రికార్డును సాధించింది. ఈ సీజన్‌లో ప్రాజెక్టులోకి వరద ప్రవాహం భారీగా వచ్చి చేరుతుండడంతో ఇప్పటివరకు 105 టీఎంసీల నీటిని దిగువకు వదిలి రికార్డును బ్రేక్‌ చేసినట్లయింది. ఈ సీజన్‌ పూర్తయ్యే వరకు మరో 10 టీఎంసీల వరకు నీటిని వదిలే అవకాశం ఉందని ప్రాజెక్టు అధికారులు భావిస్తున్నారు. అదేవిధంగా సింగూరు జల విద్యుత్‌ ఉత్పత్తి కేంద్రానికి ఈ సీజన్‌లో 3.50 టీఎంసీల నీటిని వదిలినట్లు ప్రాజెక్టు అధికారులు చెబుతున్నారు.

By RAHEEM

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *